సింగిల్‌గానే పోరాడతా అంటూన పవన్….వార్ వన్ సైడే.. జనసేన v/s జగన్ సేన.**

ప్రధాన ఎన్నికల పోటీ దారులు వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ పార్టీలే అనడం లో ఎలాంటి సందేహాం లేదు.టీడీపీ ఎన్నికల ముందు వివిధ పథకాలతో వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు. పొలిటికల్ చదరంగంలో శత్రువులు మిత్రులుగా.. మిత్రులు శత్రువులుగా మారిన సందర్బాలు అనేకం.

పక్కరాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. ఏపీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది.

2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేస్తాడంటూ సర్వేలు, పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చలు నడిచాయి.

అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ద్వారా చంద్రబాబుతో దోస్తీ కట్టడంతో జగన్‌కి సీఎం కుర్చీని దూరం చేశారు.

అయితే పవన్ సపోర్ట్ చేయకపోయినా చంద్రబాబు సీఎం అయ్యేవారంటూ తెలుగు తమ్ముళ్లు వాదించారు… కానీ పవన్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉందనే విషయం వాస్తవమే కదా… 2019 నాటికి ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

విభజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైతే.. బీజేపీ విభజన హామీలను నిలుపుకులోకే పోవడంతో కాంగ్రెస్ కంటే దారుణమైన పరిస్థితిలో ఉంది.ఇక వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ మధ్యే.

అధికార టీడీపీ ఎన్నికల ముందు వివిధ పథకాలతో వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ ఈసారి ఎవరికీ సపోర్ట్ చేసేది లేదని.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్ధుల్ని నిలబెడతాను.. అసెంబ్లీలో అధ్యక్షా అంటూ కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ తరుణంలో పవన్-జగన్ కలిస్తే వార్ వన్‌ సైడ్ అవుతుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. ‘నిజంగా పవన్ కళ్యాణ్‌కి ముందుచూపు ఉంటే., చరిత్రహీనుడిగా మిగలకూడదు అనుకుంటే, వైఎస్సార్సీతో పొత్తు కుదుర్చుకుని వార్ వన్ సైడ్ చేసేయ్యాలి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పుడు సమూలంగా మారే అవకాశం ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు.

‘ఒకపక్క నేను ఎవరితోనూ కలవను.. సింగిల్‌గానే పోరాడతా.. అంటుంటే గతంలో సపోర్ట్ చేసిన టీడీపీని కాదని జగన్‌తో ఎలా కలుస్తారు.

ఆయన అవసరం వైసీపీకీ ఏం అవసరం లేదు’ అని వైసీపీ శ్రేణులు ఈ పోస్ట్‌పై స్పందిస్తుంటే.. ‘పవన్ కళ్యాణ్ మీద ఉన్న నా ప్రేమను మీరు అర్ధం చేసుకోవడం లేదు’ అంటూ కత్తి రిప్లై ఇస్తున్నాడు.

చూడాలి కత్తి మహేష్ మనసులో కోరిక ఎంత వరకూ నిజం అవుతుందో వేచి చూడాలి మరి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *