డిఎల్ కు మైదుకూరు…సీటు…*

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మైదుకూరు సీటును డీ.ఎల్. రవీంద్రారెడ్డికి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు.

రవీంద్ర రెడ్డి కు మైదుకూరు సీటు ఇస్తే ఎంపీ సీటుకు అక్కడి నుంచి మెజార్టీ వస్తుందని ,కడప ఎంపీ అభ్యర్థి, మంత్రి ఆది నారాయణ రెడ్డి కూడా అంటున్నట్లు తెలిసింది.

ఇందుకోసం చంద్రబాబును కూడా ఒప్పించారు. నాకు అదే సీటు కావాలని పట్టుబట్టిన బీసీ నేత, మంత్రి యనమల వియ్యంకుడికి పొద్దుటూరు సీటు ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

పొద్దుటూరులో నంద్యాల వరదరాజుల రెడ్డి, సీఎం రమేష్ వర్గాల పోరుతో ఇద్దరికీ టికెట్ నిరాకరించారు.

జిల్లాలో ఒక సీటు తప్పకుండా బీసీకి ఇవ్వాలనే సూత్రాన్ని అమలు చేస్తున్నారని ఈరోజు కడప జిల్లా నాయకులతో సీఎం భేటిలో ఇది కూడా ఒక పాయింట్ అని తెలిసింది.

తద్వారా కడప ఎంపీ సీటుకు కూడా ఈ రెండు నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీ రాబట్ట వచ్చని ఆశిస్తున్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన దుగ్గిరెడ్డి లక్ష్మారెడ్డి రవీంద్రారెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా మైదుకూరు నుంచి గెలుపొందారు.

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి రాజకీయ పయనమెటు అంటూ సాగుతున్న చర్చలకు ముగింపు పలికారు సీఎం చంద్రబాబు.

ఇటీవల సీఎం చంద్రబాబును డీఎల్‌ కలిసి చర్చించి వచ్చాకా ఆయన గ్రౌండ్‌లో సైలెంట్‌గా పని చేసుకుంటున్నారు.

పుట్టా, డీఎల్ ఇద్దరు కలిసి పనిచేస్తే మైదుకూరు, పొద్దుటూరు రెండూ ఈజీగా గెలుస్తారని విశ్లేషకుల అంచనా.

తద్వారా కడప ఎంపీ సీటుకు కూడా ఈ రెండు నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీ రాబట్ట వచ్చని ఆశిస్తున్నారు.

నాటి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.. మొదటి నుంచి కాంగ్రెస్‌ నేతగానే వ్యవహరిస్తూ వచ్చారు.

2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్ గా కొనసాగుతున్నారు. ఈసారి ఏదోక పార్టీలో చేరి ఉన్న కేడరుకు, అనుచరులకు భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు.

తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, వైఎస్‌ సమకాలికుడిగా పనిచేశానని, ఎవరైనా గౌరవంగా పార్టీలోకి పిలిస్తే వెళతానని అప్పట్లోనే ప్రకటించారు. 

గత నెల 16న సీఎం చంద్రబాబుతో డీఎల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసే అంశంపై చర్చలు జరిగినట్లు డీఎల్‌ అనుచరులు పేర్కొంటున్నారు.

డీఎల్‌ పార్టీలో చేరితే ఎవరికి టికెట్‌ ఇచ్చినా టీడీపీ అభ్యర్థి గెలుపునకు మార్గం సుగమమవుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఈ మేరకు ఈ నెల 10న మైదుకూరులోని డీఎల్‌ సొంత జూనియర్‌ కళాశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించి నూతనోత్సాహాన్ని నింపారు. గ్రామగ్రామాన ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే వివరణ ఇస్తూ సైలెంట్ గా పనులు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *