తెలుగుదేశానికి ఓటేస్తే మనకు మనం ఉరేసుకున్నట్టే అని పబ్లిక్ గా ప్రకటించిన అపర మేధావి లోకేష్.. మళ్లీ దొరికిపోయాడు

నిండు సభలో అందరి ముందు అడ్డంగా దొరికిపోవడం లోకేష్ కు కొత్తేంకాదు, వింత అంత కంటే కాదు.

తన తండ్రి అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీనే కులగజ్జి పార్టీగా అభివర్ణించిన గొప్ప పుత్రరత్నం ఈయన. తెలుగుదేశానికి ఓటేస్తే మనకు మనం ఉరేసుకున్నట్టే అని పబ్లిక్ గా ప్రకటించిన అపర మేధావి. అలాంటి లోకేష్ మరోసారి దొరికిపోయారు.

ఈసారి సోషల్ మీడియా సాక్షిగా లోకేష్ బుక్ అయ్యారు.

ఎవరు వెలికి తీశారో కానీ, దాదాపు మూడేళ్ల కిందట లోకేష్ పెట్టిన ఓ ట్వీట్ ను సోషల్ మీడియాలో బయటకుతీశారు.

సింపుల్ గా దాని సారాంశం ఏంటంటే.. “12 ఏళ్లలో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కలిసి హైదరాబాద్ లో మెట్రోరైలు కట్టలేకపోయారు. అధికారంలోకి వచ్చి 19 నెలలైన (మూడేళ్ల కిందట) టీడీపీ మాత్రం 2018 డిసెంబర్ నాటికి విజయవాడ మెట్రో పూర్తిచేస్తుంది.

అప్పుడు లోకేష్ పెట్టిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆల్రెడీ 2018 డిసెంబర్ ముగిసింది. బెజవాడలో మెట్రోరైలు ప్రాజెక్టు ఒక్క ఇంచీ కూడా ముందుకు కదల్లేదు.

అసలు ఆ ప్రాజెక్టే అక్కడ రాదు. దీనిపై నెటిజన్లు సెటైరిక్ గా స్పందించారు. ఈసారి విజయవాడ వెళ్లినప్పుడు కచ్చితంగా మెట్రో ఎక్కుతానంటూ ఒకరు జోకేస్తే..

లోకేష్ అన్న నాకొక బాల్కనీ టికెట్ (మెట్రోలో) అంటూ మరొకరు అందుకున్నారు.

ఇంతకీ మెట్రోరైలు రోడ్డుపైనే ఉందా.. కృష్ణానది కింద కట్టారా అంటూ మరొకరు సెటైర్.

నాన్నకు చెప్పకుండా ట్వీట్ పెడితే ఇలానే దొరికిపోతావంటూ మరికొందరు అందుకున్నారు. ఇంకొందరు మాత్రం వ్యంగ్యంగా లోకేష్ ను సమర్థిస్తూ వస్తున్నారు.

లోకేష్ అర్థంలో మెట్రో అంటే మెట్రోరైలు కాదట. మెట్రో షూ కంపెనీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ సూపర్ మార్కెట్ అంట.

ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం సక్సెస్ అయిందంటూ ఒకటే జోకులు. ఇలా ఒకటి కాదు, వందల సంఖ్యలో లోకేష్ పై సెటైర్లు పడుతూనే ఉన్నాయి.

ఇవి మాత్రమేకాదు, గతంలో చంద్రబాబు చేసిన కొన్ని తప్పుడు ప్రకటనలకు సంబంధించిన ట్వీట్లు, గతంలో మోడీని నెత్తినెక్కించుకున్నప్పుడు బాబు పెట్టిన ట్వీట్లు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అలాంటివన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ అవుతున్నాయి. పాపం, లోకేష్ పెట్టిన ఈ మెట్రో ట్వీట్ మాత్రం డిలీట్ అవ్వట్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *