పరిటాల రవి కీలక అనుచరుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి పరిటాల సునీత కు భారీ షాక్

సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కిలకనాయకురాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కు గట్టి షాక్ తగిలింది.

పరిటాల రవి అనుచరుడు ఒకరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.

తీవ్ర అసంతృప్తి ఎందుకంటే పరిటాల సునీత పై తీవ్ర అసంతృప్తి ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారు ,అని రాజన్న తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

సునీత తర్వాత పరిటాల శ్రీరామ్ ఇటీవలే రాజకీయాల్లో ఎదుగుతున్న విషయం తెలిసిందే.ఆయన రాప్తాడు లో కీలకంగా మారారు ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ పాలన అని ఆరోపణలు చేయడం గమనార్హం.

ఆమె వైఖరి కారణంగానే తాను గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.

ఆయన సోమవారం తన స్వగ్రామం తల్లి మడుగు లో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరులతో సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా సునీత తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిటాల రవి మృతి తరువాత పక్కన పెట్టారు.

పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నాడు తాను పరిటాల రవి తో కలిసి నడిచానని.

భూస్వామ్య పోరాటలుచేసినట్టు రాజన తెలిపారు. రవి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల సునీత తన భర్త ఆశయాలను పక్కన పెట్టారని ఆరోపించారు.

రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ సభ్యులు ,బంధువులకు తప్ప పేదలకు ,బడుగు, బలహీన వర్గాలకు జరుగుతున్న మేలు లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

వేగంలేం ,సునీతతో వేగలేo అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమని రాజన్న చెప్పారు.

తాను త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి లో చేరనున్నట్లు తెలిపారు.

పేదలకు న్యాయం జరగడం లేదని అందుకే జగన్ పక్షాన నిలిచేం దుకు సిద్ధమయ్యామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *