అప్లికేషన్ దరఖాస్తు కు డెడ్ లైన్ ప్రకటించిన జనసేన….

జనసేన..పార్టీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది టికెట్ల కోసం… అందుకు సంబంధించి డెడ్ లైన్ కూడా అనౌన్స్ చేసింది.

ఈ నెల ఇరవై ఐదో తేదీలోగా పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వాళ్లంతా దరఖాస్తులు చేసుకోవాలని.. ఆ తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని ఆ పార్టీ ప్రకటించింది.

దరఖాస్తుల వడపోతకు జనసేన అధినేత పవన్  కల్యాణ్ కమిటీని నియమించింది. …. అన్ని లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకూ జనసేన దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీని కూడా ప్రకటించేసింది జనసేన.

మరో ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆ రోజు లోపు దరఖాస్తు చేసుకోవాలని జనసేన ప్రకటించింది. ఇప్పటివరకూ అన్నీ కలిపి పదిహేనువందల అప్లికేషన్లు వచ్చాయట.

ఓవరాల్ గా రెండు వేల వరకూ అప్లికేషన్లు రావొచ్చని జనసేన అంచనా వేస్తోంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల గడువు ముగిసింది.

ఇప్పుడు జనసేన దరఖాస్తుల గడువుకూడా ముగియనుంది… జనసేన విషయంలో ఇంకా చాలా సందేహాలు పెండింగ్ లో ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు అని పవన్ ప్రకటించారు. అయితే ఆ పార్టీలకు ఇప్పటి వరకూ సీట్ల కేటాయింపు మాత్రం జరగలేదు. జనసేన తరఫున అన్ని సీట్లకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారట.

ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు.. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కని పక్షంలో ఆ జనసేనలోకి చేరాలని కొంతమంది నేతలు భావిస్తున్నారు. అలాంటి చేరికలు ఇంకా మొదలేకాలేదు.

అలాంటిది జనసేన అప్పుడే దరఖాస్తుల తేదీ దాటిపోయింది అనేయగలదా, ఆ తర్వాత వచ్చి చేరేవారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదా? దీనికి సంబంధించి త్వరలోనే సమాధానం తెలియనుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *