3 రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు

‘మధ్యప్రదేశ్ లో కమల్నాథ్’, రాజస్థాన్ లో గహ్లోత్, చత్తీస్గఢ్ లో భూపేశ్ ప్రమాణ స్పీకారం *

ఈ ప్రమాణ స్వీకారం కి అశోక్ గహ్లోత్ ప్రమాణస్వీకారోత్సవానికి బస్సులో వెళ్తున్న మాజీ ప్రధాని ”మన్మోహన్ సింగ్” కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డీఎంకే అధిపతి స్టాలిన్ వారితోపాటు తదితరులు హాజరయ్యారు.

మధ్యప్రదేశ్,  రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు  కొలువుదీరాయి.  మధ్యప్రదేశ్ లో  కమల్ నాథ్,     రాజస్థాన్లో అశోక్ గహ్లోత్,  ఛత్తీస్గఢ్ లో భూపేశ్  బఘేల్ లు   ముఖ్యమంత్రులుగా   ప్రమాణస్వీకారం చేశారు.      

సోమవారం ఆయా రాష్ట్రాల్లో  ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో  వారితో గవర్నర్ లు   ప్రమాణం చేయించారు.  భారీ ఏర్పాట్లులో , పెద్ద  సంఖ్యలో హాజరై న  నేతలు,    కిక్కిరిసిన కార్యకర్తల నడుమ   ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు "రాహుల్ గాంధీ"  మాజీ ప్రధానులు  "మన్మోహన్ సింగ్"  "దేవెగౌడ"  ముఖ్యమంత్రులు 'చంద్రబాబు' 'కుమారస్వామి'  'నారాయణస్వామి'   సహా పలు విపక్షాల నేతలు హాజరయ్యారు.   రాజస్థాన్ మధ్యప్రదేశ్ లలో ,  వారంతా కలిసికట్టుగా   అభివాదం తెలుపుతూ ఐక్యత చాటారు.

భూపాల్ లో పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు. కమల్ నాథ్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార సారథి జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్ స్వయంగా వెంటబెట్టుకొని వేదిక వద్దకు చేరుకున్నారు . రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఉప ముఖ్య మంత్రి సచిన్ పైలెట్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదుతరులు హాజరయ్యారు. భాజపా మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, కైలాస్ జోషి, బాబూలాల్ గౌర్లతో పాటు కాంగ్రెసు సీనియర్ నేతలు మల్లి కార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *