టీడీపీ కి మరో దెబ్బ

ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రకటించారు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్.

ysr కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని అభినందిస్తూ మాట్లాడారాయన.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే స్టాండ్ తో ఉన్నారని, ప్రత్యేకహోదాకు కట్టుబడ్డ ఒకే ఒకనేత వైఎస్ జగన్ అని అవంతి అన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా విషయంలో అనేకసార్లు మాట మార్చారు అని.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడి అవినీతి, బంధుప్రీతి అని శ్రీనివాస్ అన్నారు.

ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే.. తెలుగుదేశం ఎంపీలంతా రాజీనామా చేయాలని తను ప్రతిపాదించినట్టుగా అయితే తనమాటను తెలుగుదేశం నేతలు ఎవరూ పట్టించుకోలేదు అని అవంతి అన్నారు.

తను ఏంచెబితే అంతా అదే నమ్మేస్తారు అనేది చంద్రబాబు నాయుడి విశ్వాసం.. అని అందుకే ప్రతి విషయంలోనూ మాట మారుస్తూ పోతున్నారని అన్నారు.

మొత్తానికి తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ నివాసం ముందు క్యూ కడుతున్నట్టుగా ఉన్నారు.

నిన్న ఒక ఎమ్మెల్యే ఈరోజు ఒక ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు.

ఈ జాబితాలో మరింతమంది ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *