ఒక పెద్ద హిట్ కొట్టాల్సిందే మరి..

ఎన్టీఆర్ బయోపిక్ ఫార్ట్ వన్ నష్టాల విషయంలో బాలయ్య చాలా ఉదారంగా వ్యవహరించారు. పార్ట్ వన్ బయ్యర్లకే సినిమా ఇచ్చారు.

అలాగే 33శాతం పార్ట్ వన్ లాస్ లు భరించారు.

పార్ట్-2 ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చి దాని వసూళ్లలో 40శాతం వాళ్లనే తీసుకోమన్నారు.

ఇదీ ప్రచారంలో వున్న విషయం. అయితే ఇది ఎంతవరకు నిజం. అందులో వున్న మతలబు ఏమిటి? చూద్దాం.

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ కారణంగా 75 నుంచి 80శాతం వరకు నష్టపోయారు బయ్యర్లు.

ఉదాహరణకు కృష్ణా, వైజాగ్ కలిపి 11 కోట్లకు కొంటే నాలుగుకోట్లు వచ్చాయి. ఏడుకోట్లు పోయాయి.

ఇప్పుడు ఇందులో 33 పర్సంట్ వెనక్కు ఇవ్వడం అంటే సుమారుగా రెండున్నర కోట్లు అయినా అయివుండాలి లేదా టోటల్ మీద 33శాతం అంటే మూడు కోట్లకు పైగానైనా అయివుండాలి.

ఆ క్లారిటీ బయర్లకే తెలిసిన విషయం.

అయితే ఇదేమన్నా నగదుగా ఇప్పుడు ఇస్తున్నారా? అంటే లేదు. రెండోభాగం విడుదల అయిన తరువాత వచ్చిన కలెక్షన్లలో ఆ 33శాతం మేరకు వెనక్కు ముందుగా తీసేసుకోవాలి.

అంటే రెండోభాగం కూడా విశాఖ, కృష్ణా 4 కోట్ల మేరకు చేస్తుంది అనుకుంటే  రెండున్నర కోట్లు తీసేసుకోవాలి.

ఇక మిగిలింది కోటిన్నర. ఇందులో నలభైశాతం తీసుకోవచ్చు. అంటే 60 లక్షలు. అంటే టోటల్ గా 11 కోట్లు వెనక్కు వచ్చేది, ముందు వచ్చిన నాలుగు, వెనక వచ్చే నాలుగు అనుకోవాల్సి వుంటుంది.

అప్పుడు నికరంగా లాస్ ఇంకో మూడుకోట్లు వుంటుంది.

ఇదంతా ఏమిటి? మొదటిభాగం మాదిరిగానే రెండోభాగం కూడా ఆడితేనే. బయ్యర్ల అదృష్టం బాగుండి, మొదటి భాగం మాదిరిగా ఆడితే పాతికశాతం నష్టాలతో బయటపడతారు.

పార్ట్ వన్ కన్నా తేడా చేస్తే, కష్టమే.  లేదూ, అదృష్టం ఇంకా బాగుండి వీరకుమ్ముడు కుమ్మి, బ్లాక్ బస్టర్ అయితే, బాలయ్య పేరు చెప్పుకుని పండగ చేసుకుంటారు.

బాలయ్య పార్ట్ 2 సంగతి మరచిపోయినా, దానిపై ఏమీ రాదనుకున్నా, ఈ టోటల్ ప్రాజెక్టులో మాత్రం ఆయన సంస్థకు బాగానే మిగిలినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అదీ విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *