నాకు నేనే పోటీ అంటున్న సినీ సంగీత దర్శకుడు సాలూరు కోటి

సంగీతంలో గురువు దైవం అన్నీ నా తండ్రి సాలూరు రాజేశ్వరవేనని సినీ సంగీత దర్శకుడు కోటి అన్నారు.

తాను ఇప్పటివరకు 470 చిత్రాలు సంగీతం అందించిన ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. త్వరలో ఓ చిత్రంలో తొలిసారిగా తండ్రి పాత్రలో నటించబోతున్నారని చెప్పిరు.

వేటూరి పురస్కారం రెండోసారి నాకే రావడం గర్వంగా ఉంది. మొదటి హైదరాబాదులో ఇచ్చారు ఇప్పుడు విశాఖలో ప్రధానం చేశారు.

నన్ను, రాజును తన వారీగా వేటూరి చూసేవారు. కొత్త బాణీలకు ప్రయోగాలకు వేటూరి సాహిత్యం అందించారు.

యముడికి మొగుడు, పెద్దన్నయ్య, బంగారు బుల్లోడు , హిట్లర్, ఇద్దరూ ఇద్దరే. గోవిందా గోవిందా, శత్రువు వంటి ఎన్నో చిత్రాలు కలిసి పనిచేసాం.

వేటూరి తో చివరిగా శ్రీనివాస్ కళ్యాణం పనిచేసాను. తిరుపతి లేజర్ షాకు 22 నిమిషాల నిడివిలో శ్రీనివాస్ కళ్యాణం ముఖ్య ఘట్టాలు చెప్పగలిగాo. అది ఆయన గొప్ప ప్రయోగం.

శాస్త్రీయo,సంగీతం రాగం, మీద వేటూరి కి ఎంతో పట్టుంది. ఇప్పటికీ 470 చిత్రాలకు మ్యూజిక్ అందించారు.

ఎన్ని చేశామని కంటే ఎంత బాగా చేశాo. ప్రజల మధ్యలో ఎంత వరకు నిలిచియనేది ముఖ్యం.

శోభన్ బా బునటించిన సంసారం చిత్రంతో గుర్తింపు వచ్చింది. కృష్ణ నా పిలుపే ప్రభంజనం కెరీర్ టర్నింగ్.

యముడికి మొగుడు ,బంగారు బుల్లోడు, హలో బ్రదర్, ఈవీ వీ దర్శకత్వం లో సుమారు 22 చిత్రాలు చేశాను.

నాన్న సాలూరు రాజేశ్వర రావునాకు గురువు. దైవం ఆదర్శం. ఎప్పుడూ ఆయన బాణీలు కాఫీ కొట్టలేదు. నాకంటూ ఓ స్టైల్ ఏర్పాటు చేసుకున్న. గాయకులొఎస్పీ బాలు ,చిత్ర చాలా ఇష్టం.

నాకు నాన్న సాలూరు రాజేశ్వరరావు, అమ్మ దూరమైనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. గురువు చక్రవర్తి మరణం కలిచివేసింది.

నేను ఇండస్ట్రీలో పోటీగా ఎవరినీ భావించను. ప్రతి రంగంలో పోటీ ఉంటుంది ప్రతి ,చిత్రం చాలెంజిగా చేస్తాను. హాలీవుడ్ స్థాయికి వెళ్లాలని కసి , తపన ,సంకల్పం,యుంది.

దేవుడి దయ ఎలా ఉందో కోటి కీ పొటి కోటియే. కాలాన్ని బట్టి అన్ని మారుతుంటాయి.

పూర్వీకులు అందించిన గొప్ప బాణీలు ,రాగాలు శృతి తప్పకూడదు. వాటిని కొనసాగిస్తూ ప్రయోగాలు చేయాలి. అప్పుడే సంగీతములో జీవం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *