నేనెందుకు డల్లాస్ వెళ్ళాలి? ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా NRI మదిలో మాట…

ఈ నెల 17 వ తేదీన డల్లాస్ నగరంలో జరగబోయే ప్రవాసాంధ్ర ఆత్మీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేయనున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా వేలాదిమంది ప్రవాసాంధ్రులు అమెరికా మరియు కెనడా దేశాలనుంచి భారీ స్థాయిలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వేలాది మంది మధ్యలో విడిగా ఒక్క ఫోటో కూడా తీసుకో లేనే…. మరి నేనెందుకు ఈ సభకు వెళ్ళాలి? అందరిలో ఒక్కడిలా వెళ్లేకంటే ఇంట్లో కూర్చొని టీవీ లో లైవ్ చూడొచ్చు కదా… మరి ఎందుకు?
- వినాలనుంది. కడప దాటి ప్రతి గడప కూ వెళ్లి ప్రజల గుండెచప్పుడు వినాలనుంది అంటూ తండ్రి బాటలో పయనించి రాష్ట్రమంతటా ప్రజల్లో తిరిగి బ్రహ్మాండమైన విజయంతో ముఖ్యమంత్రి అయిన జగనన్న నా గడప తట్టి అమెరికా వస్తుంటే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను?
- రావాలి జగన్ కావాలి జగన్ అంటూ రేయింబవళ్ళు అమెరికా నుండి ఉడతా భక్తి గా నా వంతు సాయం నేను చేశాను. రావాలి రావాలి అంటే ఆ జగనన్న నేనున్న దేశానికొస్తుంటే వెళ్లకుండా ఉండగలనా?
- వెళ్ళాలి …నేను డల్లాస్ వెళ్ళాలి…. నా తోటి మిత్రబృంద కేరింతల్లో నేనూ భాగం కావాలి.. జగనన్న విజయం మా అందరిదీ అని స్టేడియం మొత్తం దద్దరిల్లేలా, north, south, east , west నుండి వచ్చిన అందరి అభిమానుల సందడి కళ్ళారా చూడాలి. ఈ దినం కోసమే నేను ఇన్నాళ్లు ఎదురు చూసింది.
- నా రాష్ట్రo అభివృద్ధి దిశగా పరుగులు పెట్టే మా ఈ జగనన్న పరిపాలనలో ఒకరోజు ఆయన్ను కలవాలి. నాతో ఫోటో లేకపోయినా పర్లేదు….నా కళ్ళారా చూస్తే చాలు.
- వస్తున్నా మీకోసం అంటూ మా పల్లెలన్నీ తిరిగావు. ఇప్పుడేమో మా NRI లకోసం వస్తున్నావు. మరి ఇప్పుడు మేము గర్వంగా చెప్తున్నాం జగనన్నా….. వస్తున్నా మీకోసం. డల్లాస్ లో జరిగే, నా గుండె చప్పుడు వినిపించే మన ఆత్మీయ సమావేశానికి….. వస్తున్నా…
Credits: Sahadev Bode