నేరుగా మగ్గాలను నమ్ముకుని …. నేతన్నల బ్యాంకు ఖాతాలకు రూ.24వేలు..జగన్ సర్కార్

ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది.
సర్వే జాబితాలను జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఖరారు చేశారు. ఇప్పటికే నిధులు విడుదల చేశారు.
జగన్ సర్కార్ వరుసగా రెండో ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఫోకస్ పెట్టింది. గత రెండు మూడు నెలలుగా పథకాలకు శ్రీకారం చుడుతోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనుంది.
ఈ నెల 20న ముఖ్యమంత్రి జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది.
సర్వే జాబితాలను జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఖరారు చేశారు. ఇప్పటికే నిధులు విడుదల చేశారు.
గతేడాది అర్హులైనా నేతన్న నేస్తం లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆర్థిక సాయం అందుకోని వారు కొందరున్నారు.. వారికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పవర్‌లూమ్స్ రావడం వల్ల చాలా మంది చేనేతలు ఆర్థికంగా ముందుకు సాగలేక పోయారు.
కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సాయ పడుతోంది.

గతంలో పెట్టుబడి సాయం లేక మాస్టర్ వీవర్లను చేనేత కార్మికులు ఆశ్రయించే వారు.. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయంటోంది ప్రభుత్వం.
నేరుగా ప్రభుత్వం సాయం అందించడంతో జీవనోపాధిని మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఏర్పడింది అంటోంది.
వాస్తవానికి ఈ నెల 17న పథకం ప్రారంభించాల్సి ఉన్నా అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ నెల 20కు వాయిదా పడింది.
ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేస్తారు.. ఆ డబ్బు నేరుగా నేతన్నల బ్యాంకు ఖాతాలకు జమకానుంది.