ఏపీ శాసనమండలిలో లోకేష్ వ్యవహరించిన తీరుపై..మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు

తనతో పాటూ ఇతర మంత్రులపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరు దారుణమని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

ఫొటోలు తీయొద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని.. తనపై దాడికి నారా లోకేష్ కారణమన్నారు.

టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారని.. మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గుగా ఉందన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్‌ ఫొటోలు తీశారని.. శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదన్నార.

తనతో పాటూ ఇతర మంత్రులపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జగరకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరతామన్నారు.

ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించకూడదన్నారు.

మండలిలో ప్రజలకు సంబంధించిన బిల్లుల్ని టీడీపీ అడ్డుకుందని మంత్రి ఆరోపించారు.

అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చర్చించని టీడీపీ.. మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకుందని మండిపడ్డారు. రూల్ 90 ద్వారా చర్చకు అడ్మిట్ చేయకుండానే యనమల మాట్లాడారని.. తాను చర్చకు అనుమతించ లేదని మండలి ఛైర్మన్ కూడా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.

ఈ బిల్లులను కొన్నాళ్ల పాటు ఆపి ఆనందం పొందగలరని.. తర్వాత లాభం ఏముంటుందన్నార. ప్రజల కోసం అన్నీ భరిస్తున్నాం.. మేం తిరగబడితే తట్టుకోలేరన్నారు.

శాసనమండలిలో జరిగిన ఘటనలు దారుణమని మరో మంత్రి అనిల్ కుమార్. మండలిలో సంఖ్యా బలం ఉందని ఏమైనా చేస్తామంటూ యనమల రామకృష్ణుడు మాట్లాడారని, రూల్‌ 90 నోటీసు ఒక రోజు ముందివ్వాలని చెప్పినా వినలేదన్నారు.

మండలిలో నారా లోకేష్‌ను వీడియోలు తీయొద్దని చైర్మన్ కూడా చెప్పారని.. ప్రశ్నించిన మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నించిందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *