అచ్చెన్నాఅరెస్ట్..అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు..డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. అలాగే అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు.

అయ్యన్నపాత్రుడుపై నిర్భయ యాక్ట్‌ నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.

అయ్యన్నపాత్రుడుపై నిర్భయ యాక్ట్‌ నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్టు పనిచేస్తున్నారని.. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారన్నారు.

అలాగే సోషల్‌ మీడియా, సొంత మీడియా ద్వారా విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారని.. డా.సుధాకర్‌, డా. అనితారాణిపై పెట్టిన కేసులను కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.

బీసీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ మరచిపోక ముందే అయ్యన్నపాత్రుడిపై వరుస కేసులు పెట్టడం బీసీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోందన్నారు టీడీపీ అధినేత.

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అయ్యన్నపాత్రుడిదని.. నిజాయితీ పరుడు, ఎవరినీ నొప్పించని నాయకుడన్నారు.

అలాంటి వ్యక్తిపై విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వైసీపీ ప్రభుత్వ దురుద్దేశానికి ప్రత్యక్ష సాక్ష్యమని వ్యాఖ్యానించారు.

అయ్యన్నపై నిర్భయ కేసు పెట్టడం దారుణమన్నారు.

అయ్యన్నపాత్రుడిపై ఆరు కేసులు పెట్టారని.. ఈ తప్పుడు కేసులపై అయ్యన్న కోర్టుల ద్వారా పోరాడి విజయం సాధించారన్నారు.

య్యన్నపై నిర్భయ కేసు పెట్టడం దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడిపై ఆరు కేసులు పెట్టారని.. ఈ తప్పుడు కేసులపై అయ్యన్న కోర్టుల ద్వారా పోరాడి విజయం సాధించారన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య నాలుగు మూల స్థంభాలు లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిసియరీ, మీడియాను ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు.

ఈ దురాగతాలకు పోలీసు శాఖ, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలికాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డీజీపీపై ఉందన్నారు.

ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *