ముసుగు కుల రాజకీయాల మధ్య బాబు…

చంద్రబాబు నాయుడు కొత్త విమర్శలతో ,ఆరోపణలతో హంగామా చేస్తూ ఉంటారు.. తను ఏవైతే చేస్తారో.. వాటన్నిటినీ ముందుగా తన వైరిపక్షం నేతలపై ప్రచారం చేస్తారు.. అది మన బాబు గొప్పతనం.

తాజాగా బాబు కనిపెట్టింది ఏమిటంటే ముసుకు రాజకీయాలు కుల రాజకీయాలు.. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగనలు చీకటి రాజకీయాలు చేస్తున్నారని బాబు ఆరోపించారు.

మూసుకుని తొలగించి ముగ్గురు కలిసి పోటీ చేయాలని ఆయన సూచించారు. ఇందులో ముసుగు ఏమిటో తెలియదు మరి.. నాలుగున్నర సంవత్సరాలు బిజెపితో, ప్రధాని మోదీ తో అంటకాగింది.

తెలుగు దేశం పార్టీ.. మోడీ అంత గొప్ప ప్రధాని ప్రపంచంలోనే లేరు అన్నట్లుగా తీర్మానం చేశారు బాబు. ఆయనను అందరికీ రుద్దేస్తున్నారు… కెసిఆర్ కు జగన్ కు జతకలిపారు.

సరిగ్గా 2014లో బాబు ఏమి చెప్పారు గుర్తుందా.రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి సోనియా గాంధీ ఏపీని విభజించి ఆంధ్రుల పొట్టగోట్టిందని..అనేవారు…

కెసిఆర్ జగన్ లు ఆమెకు దత్త పుత్రులను తాను మోడీ అభివృద్ధి జంట అని ప్రచారం కూడా చేశారు.

సోనియా గాంధీని దెయ్యం, మాఫియా, గాడ్సేఇలా ఎన్నో బూతులు తిడుతూ ప్రచారం చేశారు..

ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పదాలను మోడీపై ప్రయోగిస్తున్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కూడా. వారిలో ప్రజాస్వామ్యం కనిపించిందివారిలో అభివృద్ధి కూడా కనిపించింది. అంతకు ముందు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను సోనియా తరలించిందని బాబు చెబితే అంత అవును అని అన్నారు.

కానీ ఇప్పుడు అదే సోనియాగాంధీతో బాబు రాజకీయ తెలివి చూసి అంతా మక్కువ వేలేసుకుంటున్నారు.. అది కూడా సరిగ్గా చేస్తున్నారా అంటే లేదు..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని బాబు వివరించారు. అలా అనుకున్న వారంతా ఏపీకి వచ్చేసరికి కాంగ్రెస్, టిడిపిలో పొత్తు పెట్టుకోవడం లేదని ప్రకటించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

అదే సమయంలో రాహుల్ తో ఢిల్లీలో మాత్రం స్నేహం చేస్తున్నారు. దీన్ని ముసుకు రాజకీయం కాక ఇంకా ఏమంటారు.

ఏపీ లో కాంగ్రెస్ నేతలను టిడిపి చేర్చుకుంటున్న, కాంగ్రెస్ ప్రముఖులు ఒక మాట అనకపోవడం, కాంగ్రెస్ను విమర్శించకుండా వైసీపీపై టిడిపి విమర్శలు చేయడం.. ఇదంతా ముసుకు రాజకీయమే కదా…

ఇప్పుడే కాదు చంద్రబాబుకు ఇది చాలా కాలం నుంచి అలవాటైన విషయమే కదా… జగన్పై కేసులు పెట్టడానికి గతంలోనే కాంగ్రెస్ తో ఆయన కలిసినట్టు సమాచారం.

ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించడానికి బాబు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా నిర్ణయించుకున్నారు..

ఇదంతా ముసుకు రాజకీయమే కదా

అది మూసుకు రాజకీయం చీకటి రాజకీయమంటే.. అలాగే కడప ఉప ఎన్నికల్లో జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే అబద్ధ ప్రచారం కూడా జరిగింది.

ఆ వెంటనే బిజెపితో పొత్తు కుదుర్చుకోవడం అందుకోసం మూతి చుట్టూ తిరగడం అది చీకటి రాజకీయమంటే నంద్యాల ఉపఎన్నికల్లో బిజెపి వారిని ప్రచారానికి రావద్దని,వారి జండా కూడా ముస్లిం ప్రాంతంలో కనిపించవచ్చని చెప్పి చేసిన దానిని ముసుగు రాజకీయం అని అంటారు. అనైతిక రాజకీయం కూడా అని అనవచ్చు.

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో రహస్య రాజకీయ సంబంధాలు కలిగి ఉండడాన్ని చీకటి రాజకీయం అంటారు.

తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి బావమరిది హరికృష్ణ కూడా కేసీఆర్ తో పొత్తు కోసం వెంపర్లాడరు అని శవరాజకీయం అంటారు కదా..

టిఆర్ఎస్ ఒప్పుకోకపోతే వారు ఏపీకి ద్రోహం చేస్తున్నారని దుష్ప్రచారం చేసి కూడా అనైతికరాజకీయం అని పిలవచ్చు…సమయంలో టిఆర్ఎస్ వైఎస్సార్ కాంగ్రెస్లో ఎప్పుడూ పొత్తు లో లేరు..

అనైతిక రాజకీయం కూడా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిళకలలో జగన్‌ టీఆర్‌ఎస్‌కు మద్ధతు ప్రకటించలేదు. కేవలం తన ప్రత్యర్థి అయిన టీడీపీని ఓడించండి అని మాత్రమే పిలుపు ఇచ్చారు. ఆ తర్వాత ఫెడరల్‌ ప్రంట్‌ పరిణామాలలో ముసుగు రాజకీయం చేయలేదు.

కేసీఆర్‌ తరపున కేటీఆర్‌ ఇంటికి వస్తానంటే మర్యాదపూర్వకంగా ఒప్పుకున్నారు. అది మర్యాద రాజకీయం. తదుపరి చంద్రబాబును ఉద్ధేశించి కేసీఆర్‌ కాని, కేటీఆర్‌ కాని రహస్య వ్యాఖ్యలు చేయలేదు.

బహిరంగంగానే బాబు ఓడిపోతారని తమ అభిప్రాయాలను చెప్పారు. తాజాగా కేటీఆర్‌ అదే విషయాన్ని ప్రస్తావించి చంద్రబాబు ఓటమి తప్పదని, సర్వేల ఆధారంగా చెబితే చంద్రబాబు గింజుకుని ఆ కుట్రలు, ఈ కుట్రలు అని ప్రచారం చేసి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ నేత, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తనను ఓడించడానికి చంద్రబాబు, ఆలపాటి రాజాలు ప్రయత్నించారని, వారి ఓటమికి తాను ఏపీకి వెళ్తానని బహిరంగంగానే చెప్పారు.

అందులో ముసుగు రాజకీయం ఏముంది? జగన్‌ ఎప్పటి నుంచో కేంద్రంలో ఎవరు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేవారికి తాను మద్ధతు ఇస్తానని ప్రకటించారు. అది పెయిర్‌ రాజకీయం.

కాని చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు. కేంద్రంలో ఉంటుందని చెబుతున్నారు.

అలాగని యూపీఏలో చేరారా అంటే అదీలేదు. దానిని రహస్య రాజకీయం అంటారు. అవకాశం కోసం తెరచి ఉంచుకున్నారని అర్థం.

గతంలో యునైటెబ్‌ప్రంట్‌ కన్వీనర్‌గా ఉంటూ ఆ పక్షాలన్నిటిని ముంచేసి, సడన్‌గా వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించి, ఎన్‌డీఏలో చేరిన అనుభవం చంద్రబాబుకు ఉంది. దానిని ముంచుడు రాజకీయం అంటారు.

ఇన్ని అనుభవాలతో చంద్రబాబు నాయుడు చీకటి, ముసుగు రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు.. ఏమైనా ఇది ఆయనకే చెల్లింది. ఇక కుల రాజకీయాలకు వద్దాం.

పోస్టింగ్‌లలో ఒకేకులం వారికి పెద్దపీట వేయడం కుల రాజకీయం అవుతుంది

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులను దూషించిన వీడియో అంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఆయనను వెనుకేసుకు రావడాన్ని కుల రాజకీయం అంటారు.

పైగా చింతమనేని ప్రసంగానికి చప్పట్లు వచ్చాయని అన్నారంటే ఎంతదారుణమో చూడండి.

అంటే దళితులను దూషిస్తే ఎవరైనా చప్పట్లుకొడితే దానిని అధికారంలో ఉన్నవారు ప్రోత్సహిస్తారా?

ఏపీలో ఉన్న కులాలన్నిటికి ఎన్నికల ప్రణాళికలో పేజీలు పెట్టి 119 వాగ్ధానాలు చేసి, వాటిని విస్మరించడం కుల రాజకీయం అవుతుంది.

పోలీసు అధికారుల ప్రమోషన్‌లు, పోస్టింగ్‌లలో ఒకేకులం వారికి పెద్దపీట వేయడం కుల రాజకీయం అవుతుంది.

ఆయా కులాల వారు ఎన్నికల హామీలు అమలు కోసం వస్తే వారి అంతుచూస్తానని, తోక కట్‌ చేస్తానని, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేసి వారిని అవమానించడం కుల రాజకీయం అవుతుంది.

కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పి, ఆ తర్వాత అందుకు ఉద్యమించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబాన్ని దారుణంగా పోలీసులు తిట్టడం, కాపు ఉద్యమాన్ని తొక్కిపారేడం వంటివి జరిగాయి.

ఇవన్ని కుల రాజకీయాల ఫలితమే అన్న భావన ఏర్పడుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తనకు అండగా ఉన్న మీడియాను అడ్డంపెట్టుకుని ఏమి మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నారు.

అందుకే జగన్‌ లండన్‌ పర్యటనకు వెళితే అక్కడ నుంచి డబ్బు తెస్తున్నారని ఒకరోజు, కేసీఆర్‌ వెయ్యికోట్లు జగన్‌కు ఇస్తున్నాడని మరోరోజు చెప్పగలుగుతున్నారు.

వీటన్నిటిని తెలుగుదేశం మీడియా బ్యానర్‌ కథనాలుగా మార్చి ప్రచారం చేస్తోంది.

దీనిని కుల రాజకీయం, ముసుగు రాజకీయం అంటారు. తాను కుల రాజకీయం చేస్తూ, తాను ముసుగ రాజకీయం చేస్తూ, విపక్షంపై మాత్రం ఎంతవీలైతే అంత బురద చల్లుతుంటారు.

అదే ఆయన అసలు రాజకీయం. దీనిని ప్రజలు ఎప్పటికైనా తెలుసుకుంటారో లేదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed