డాటా స్కామ్.. లోకేష్, బాబు ల ఉలికిపాటు!

ఒక ఐటీ కంపెనీపై,హైదరాబాద్ లో ఒక అపార్ట్ మెంట్ లో పోలీసుల దాడితో ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉలిక్కిపడ్డారు!

ఒక చిన్న కంపెనీ.. ఏదైనా ఐటీపార్క్ లో కూడా కాకుండా.. ఒక ఇంట్లో నిర్వహిస్తున్న తరహా కంపెనీ మీద పోలీసుల సోదాలకు తెలుగుదేశం పార్టీ ఇంతలా ఉలిక్కిపడుతూ ఉండటం గమనార్హం.

ముఖ్యమంత్రే కాదు….ఐటీమంత్రి నారాలోకేష్ బాబు కూడా స్పందించడం…. విశేఫం. అంతేనా.. ఇప్పటికే ఒక మంత్రిగారు ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు.

ఒక చిన్న కంపెనీ మీద పోలీసుల సోదాలు నిర్వహించడం.. తెలుగుదేశం ఎందుకు ఇంతగా ఉలిక్కిపడుతోంది అనేది చాలా కామన్ గా వచ్చే సందేహం.

ఈ సోదాలకు ముందు.. సదరు కంపెనీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఐటీ గ్రిడ్స్ అనే ఒక అనామక సంస్థ ఏపీలోని నాలుగు కోట్ల మంది ప్రజల ఆధార్ డాటాలతో సహా, మొత్తం సమాచారాన్ని సంపాదించుకుందని.. ఏపీ ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారాన్ని ఆ సంస్థ అక్రమంగా సంపాదించుకుందని.. హ్యాకింగ్ ద్వారా ఆ సమాచారాన్ని సంపాదించిందా లేక ఏపీ ప్రభుత్వ సహకారంతోనే ఆ సమాచారాన్ని సేకరించిందా.. తేల్చాలని.. ఒక రాష్ట్ర ప్రజలందరి సమాచారాన్ని ఒక అనామక ఐటీకంపెనీ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని .. విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు సంప్రదించారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా గగ్గోలు పెట్టారు.

ఇక సదరు సంస్థకు చెందిన ఒక ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. చినబాబు లోకేష్ స్పందిస్తూ.. ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేస్తారా, సిగ్గులేదా.. అంటూ ట్వీట్లు పెడుతున్నారు!

పోలీసులు ఒక కేటుగాడిని అదుపులోకి తీసుకుంటే.. సిగ్గులేదా? అని మంత్రిగారు విడ్డూరంగా ఉందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది… ఇది పార్టీల గొడవకాదు.. ప్రజల డాటాను ఏ రకమైన అవసరాల కోసం తస్కరించినా.. అంతకు మించిన నేరం లేదు. ఈ శతాబ్ధంలో డాటా అనేది ఒక పెద్ద వెపన్.

అది పడకూడని చేతిలో పడిదంటే.. దేశాలే నాశనం అవుతాయి. ఇలాంటి విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇంతగా గగ్గోలుపెడుతూ ఉండటంతో.. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అయినా జోక్యం చేసుకుని.. అసలు విషయాన్ని బయట పెట్టాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *