విశాఖ టీడీపీ ఈవెంట్ షో ‘ పచ్చో’త్సవం

Kamma brothers suspects other caste voters

Kamma brothers suspects other caste voters

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖను గుర్తించిందని అంతా సంబరపడ్డారు. విశాఖ ఉత్సవ్ అంటూ ప్రభుత్వమే అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహిస్తుం డడంతో ప్రపంచ దేశాల్లో విశాఖకు సముచిత స్థానం కోసమేనని అంతా ఊహించారు. సువిశాల సాగరతీరంలో అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ వేడుకలు ద్వారా విశాఖ సంస్య్రతి ,సాంప్రదాయం అంరదరికీ తెలియచేస్తారని ఆనందించారు అయితే గత అయిదేళ్లుగా ఆచరణలో జరుగుతున్నది వేరు.

ఉత్సవాల పేరుతో అధికారపార్టీ జాతర చేస్తోంది. పేదొళ్లుగా కొట్టి పెద్దోళ్లకు పెట్టే కార్యక్రమం దివ్యంగా సాగిపోతుంది. అచ్చంగా చెప్పాలంటే జనం సొమ్ముతో ప్రభుత్వం పెద్దలు సోకు చేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు విశాఖ ఉత్సవ్ పేరిట హంగామా మొదలై పోయింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో సాగర తీరంలో పెద్ద తతంగమే నడిపిస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే విషయమే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలోవరస సమీక్షలతో హ్రెత్తించేస్తున్నారు. ఇంతకీ ఈ ఉత్సవాల వల్ల సాగర జనానికి, నగరానికి కలిగే లాభామేంటన్నదీ తరచి చూసే నిరాశే కలుగుతుంది. స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఉండదు.

పడేసినట్టు గా 5000 పదివేలతో 10000 వేలతో కార్యక్రమాలు వారికి ఇస్తే కోట్ల రూపాయలతో భారీ ఈవెంట్లకు కాంట్రాక్టర్లకు ఇచ్చి సత్కరించే పక్షపాతవిధానం అమలు చేస్తున్నారు దాంతో, ఏ ఏటికి ఆ ఏడు స్థానిక కళాకారులు గోడుమనడం తప్ప వారికి దక్కేది ఏమీ లేదు. ఇక పర్యాటక పరంగా నగరానికి ఆనదంముగా వచ్చినది లేదు, ఐదేళ్ల ఉత్సవాలకూ కలుపుకుని కనీసం 20 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసే ఉంటారు దాంతో శాశ్వతమైన ఒక్క ప్రాజెక్ట్ను నగరానికి అందించిన పర్యాటక కళ ఉట్టిపడే దన్నది జనాభిప్రాయంగా ఉంది. అయితే, తాత్కాలిక ఆర్భాటాలతో ఉత్సవాల పేరిట చేసే హడావుడి వల్ల కొందరి జేబులు మాత్రమే నిండుతున్నాయి. తప్ప , పర్యాటకరంగానికి శోభ సమకూరడం లేదంటున్నారు. ఇక , విశాఖ ఉత్సవ్ అంటూ ఎంతగా డప్పు వాయించినా నగరంలోని వారే తప్ప కనీసం శివారు ప్రాంతాల ప్రజల సైతం ఇటువైపు గా తొంగి చూడ డ్ంలేదు.

ఇది గత ఐదేళ్ల అనుభవం రుజువు చేసిన సత్యం. ఆ జనం కూడా నిత్యం బీచ్ వాహ్యాళికి వచ్చే వారే తప్ప కొత్త గా ఉత్సవాలను చూసి ఎగిరిగంతేసి వస్తున్నవారేమీ కారన్నది నిజం మరి, కోట్లు ఖర్చుపెట్టి చేస్తున్న ఈ భారీ ఈవెంట్ ఎవరి కోసం అన్నది మంత్రి సామంత కులే తెలియాలి అంటున్నారు ఇదిలా ఉండగా, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సొం బాకా ఊదుకోవడానికి తరచూ ఈ తరహా ఈవెంట్ లతో రంజింప చేస్తున్న సంగతి విధితమే. విశాఖ ఉత్సవ్ పేరిట కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నప్పటికీ దీని మూలంగా ఇక్కడి ప్రజల కంటే అధికార పార్టీకి చెందిన ప్రముఖులు వారి అనుచరులకే లాభం చేకూర్చుతున్నది అందరి మాటగా ఉంది.

ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న టీడీపీ నాయకులు విశాఖ ఉత్సవ్ ను కూడా సద్వినియోగం యధాశక్తిన వాడేసుకుంటున్నారు. ఎన్నికల ఏడాది కావడం తో పసుపు పార్టీ ప్రచారానికి లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇక విశాఖ ఉత్సవ్ పుణ్యమాని అధికారపార్టీ నాయకులకు అత్యంత దగ్గరగా వుండే పలువురు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి కోట్లాదిరూపాయల కొల్లగొట్టారన్న విమర్శలు గట్టిగా విసిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ విశాఖ ఉత్సవ్ కానీ , లబ్ధి పొందేది అచ్చంగా అధికార పార్టీ మనుషులు. రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీ నివాసరావు ఆయన అనుచరులకు ఈ ఉత్సవ్ ద్వారా పెద్ద ఎత్తున లబ్ధచేకూరే విధంగా పావులు కదుపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

జీవీఎంసీ , వుడా కార్యాలయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి గంటా ఈ రెండు విభాగాలు ద్వారా విశాఖ ఉత్సవ్ పేరిట కోట్లాది రూపాయలు నిధులు మంజూరు అయ్యేలా, పనులు తమవారికి కేటాయించే విధంగా దోహదపడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిజాయితీగా టెండర్లు వేసేందుకు ముందుకు వచ్చి నవారికి మొండి చేయి చూపడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతి ఏటా విశాఖ ఉత్సవ్ సందర్భంగా స్థానిక కళాకారుల తమ ఉత్సవంలో తమకు ప్రాధాన్యత లేకపోవడాన్ని ప్రశ్నస్తు వస్తన్నరు. వారికి ఓ చేత్తో భరోసా ఇస్తున్న అధికార పార్టీ పెద్దల తీరా విశాఖ ఉత్సవ్ వేళ ఇతర ప్రాంతాలకు చెందిన కళాకారులను ఇక్కడకు తెప్పించేం దుకు లక్షల రూపాయల లు ఖర్చుచేస్తున్నప్పటీకీ , స్థానిక కళాకారులకు మాత్రం చిన్నచూపు చూడడం దారుణమంటున్నారు . విశాఖ ఉత్సవ్ లోనైనా స్థానిక కళాకారులు తమ ప్రదర్శన లు నిర్వహించుకునే వెసులుబాటు కల్వించకపోడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *