ఏపీని ముంచేశారు ఢిల్లీలో వైసీపీ ‘వంచన పై గర్జన దీక్ష’

విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హెదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచన పై గర్జన’ దీక్ష ప్రారంభమైంది. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ఈ దీక్ష చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన హామీలపై నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్సార్సీపి… హూదా సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ఏపీ లోని వివిధ జిల్లా కేంద్రాల్లో వంచన పై గర్జన దీక్షను నిర్వహించింది. అంతేకాకుండా పార్టీకి చెందిన ఎంపీలు చేత వారి లోక్సభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు సమర్పించి. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పారు. దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ ఈ దీక్షలో వైయస్సార్సీపి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గురువారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది.
వైఎస్సార్ సీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హూదా విషయంలో చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్న ఏపీ తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుందని తెలిపారు. హోదా కోసమే వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా జననేత వైఎస్ జగన్ తోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేత మల్లాది విష్ణు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పై హామీ ఇచ్చిన బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను నడి రోడ్డున పడి వేసి ఎవరి దారి వారు చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హోదాపై చంద్రబాబు ఎప్పుడూ చేతులెత్తేసి ప్రస్తుతం కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు.
టీడీపీ, బీజేపీ, కాంగ్రెసుతో ప్రజలకు ఏమాత్రం లాభం లేదని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మొట్టమొదటి పార్టీ వైఎస్సార్ సీపీనే అని గుర్తు చేశారు గతంలో కాంగ్రెస్ ను తిట్టిన చంద్రబాబు నేడు అదే పార్టీతో కలిశారని ఎద్దేవా చేశారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ లోక్సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారని.. అందరం కలిసి రాజీనామాలు చేద్దామంటే పారిపోయిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. టీడీపీ నేతలు దమ్ముంటే తమతో కలిసి రావాలని… మోడీ ఇంటి వద్ద ధర్నా చేస్తామని పిలుపునిచ్చారు.