బైక్ డిగ్రీ కాలేజ్ వద్ద యూ టర్న్ తీసుకునేందుకు ….తార్నాకలో ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లోని తార్నాకలో రహదారి రక్తసిక్తమైంది. బైక్‌ను ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్‌లో మంగళవారం రోడ్డుప్రమాదం జరిగింది.తార్నాకలో బైక్‌ను గ్యాస్ ట్యాంకర్ ఢీకొంది.ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
తార్నాకలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ ద్విచక్రవాహనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను నవీన్(50), సోమరాజు(32)గా గుర్తించారు.
మంగళవారం ఉదయం నవీన్, సోమరాజు తార్నాకలో బైక్‌పై ప్రయాణిస్తున్నారు.
బైక్ డిగ్రీ కాలేజ్ వద్ద యూ టర్న్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ వారిపై నుంచి దూసుకెళ్లింది.
రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు ఏం జరిగిందో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందిన ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
లాలాగూడ పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.