ప్రతీ సంవత్సరం ఈ దీక్ష తనకోసం చేస్తానని, ఈ సంత్సరం ప్రజలకోసం చేస్తున్నానని …ఒక పూట భోజనం..కటిక నేలపై పడుకోవాలని జనసైకులకోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ:పవన్‌

టీడీపీది తప్పే… 3 రాజధానుల పేరుతో అమ్మకం: పవన్‌
జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితులపై, రాజధాని భూముల విషయంలో స్పందించారు.

తన వ్యవసాయ క్షేతంలో జనసైకులకోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కాగా తాను ప్రజల ఆరోగ్యం బాగుండాలని చాతుర్మాస దీక్ష చేస్తున్నట్లుగా తెలిపారు.

ప్రతీ సంవత్సరం ఈ దీక్ష తనకోసం చేస్తానని, ఈ సంత్సరం ప్రజలకోసం చేస్తున్నానని చెప్పారు.

దీక్షాలో నాలుగు నెలల పాటు ఒక పూట భోజనం చేసి, కటిక నేలపై మాత్రమే పడుకోవాలని, వాటిని తాను ఆచరిస్తున్నట్లు వివరించారు.

జనసైనికుల కోరిక మేరకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ లో అన్ని అంశాల గురించి పెదవి విప్పారు పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు విషయం పై కూడా మాట్లాడారు.

కరోనా గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన పవన్‌.. ఇది ప్రపంచానికి వచ్చిన విపత్తు అని రెండు నెలల లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ఈ పరిస్థితుల్లో ఇంకా కొంచెం బాద్యతగా ఉండే బాగుండేదన్నారు. లాక్ డౌన్ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక కరోనా ని నియంత్రించడంలో విఫలమయ్యిందని ఆయన అన్నారు.

దేశంలో ఎక్కడా జరగని కరోనా టెస్టులు మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయని తను మనస్ఫూర్తిగా ట్వీట్ చేశానని కానీ పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఇంట్లోనే ఉండాలని యంత్రాంగం చెప్పినట్టు తన దృష్టికి వచ్చినట్లు పవన్ చెప్పారు.

ఒకవేళ ఆస్పత్రిలో చేర్చుకున్న సరైన సదుపాయాలు లేక సరైన ఆహారం దొరకక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే చిన్న రోగం అని చెప్పడం బాధాకరమని… యంత్రంగం బాధ్యతగా లేకపోవడమే కరోన వ్యాప్తి ఇంత భయంకరంగా ఉందని, కరోనాతో సహజీవనం చెయ్యాల్సిన పరిస్థి ఉందన్నారు.

వాక్సిన్‌ వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ దీన్ని ఎదుర్కోవడమే మార్గమని వెల్లడించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందే… ఎన్నికల ప్రచారంలో ఉన్నపుడే… ప్రతిపక్షం పార్టీ గా కొనసాగుతున్న సమయంలోనే పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు నిర్మిస్తాం అన్న విషయాన్ని చెప్పాల్సి ఉందని… ఆ విషయం చెప్పక పోవడం వల్లనే రైతులు అమరావతికి వేల ఎకరాల భూములను ఇచ్చి ఇప్పుడు బాగా నష్టపోయి బాధ పడుతున్నారని… రైతుల కన్నీటి కి కారణమైన పాలకులకు మంచి జరగదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

గతంలో అధికారంలో ఉన్న తెదేపా పార్టీ సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానని చెప్పి ఎన్నో ఎకరాల భూములను స్వీకరించడం పెద్ద తప్పని పవన్ కళ్యాణ్ చెప్పారు.

సింగపూర్‌ తరహా రాజధాని అంటూ వేల ఎకరాలను తీసుకోవడం తప్పేనని, అది మార్కెటింగ్‌ కోసం మాత్రమే పనిచేసిందని అన్నారు.

ఇప్పుడు మూడు రాజధానిల ప్రతిపాదన కూడా అలాంటిదేనని చెప్పుకొచ్చారు.

టీడీపీ వైసీపీ ఆధిపత్య పోరులో అన్యాయంగా రైతులను నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాజధాని కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ నేతలందరూ అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *