కరోనా సోకిదని కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు

గుంటూరు: కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు
ఇటీవల ఆమె గోవా నుంచి కొడుకు దగ్గరకు వచ్చింది. కొడుకు మళ్లీ గోవా వెళ్లిపోవాలని చెప్పాడు. ఆమెను బలవంతంగా తీసుకెళ్లి బస్టాండ్ దగ్గర వదిలి వెళ్లిపోయాడు. గుంటూరు జిల్లా మాచర్లలో ఘటన.
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. వృద్దురాలైన తల్లిని కొడుకు బస్టాండ్‌లో వదిలేశాడు. ఏం చేయాలో దిక్కు తోచని ఆమె రోడ్డు పక్కన అలాగే కూర్చుండిపోయింది.
విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.. వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని అందుకే కొడుకు ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లినట్లు అధికారులు తెలుసుకున్నారు.
ఇటీవల ఆమె గోవా నుంచి కొడుకు దగ్గరకు వచ్చింది. ఆమెకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తెలుసుకున్న కొడుకు మళ్లీ గోవా వెళ్లిపోవాలని చెప్పాడు.
ఆమెను బలవంతంగా తీసుకెళ్లి బస్టాండ్ దగ్గర వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు వృద్ధురాలి కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
తన తల్లికి కరోనా సోకిదని.. కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలిస్తారనే భయంతో ఇలా చేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడట. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.