బిడ్డలకు భారం కాలేక తల్లిదండ్రులు ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాదం

బిడ్డలకు భారం కాలేక తల్లిదండ్రులు ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాదం
బిడ్డలకు భారం కాకూడదని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
కన్న కొడుకులు తిట్టారని పొలంలో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్న మరో వ్యక్తి. అనంతపురం జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటనలు.
కన్నబిడ్డలకు భారం కాలేక తల్లిదండ్రులు ఊపిరి తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు వెంటాడి దంపతులు.. బిడ్డలు రాబందుల్లా పొడవడం.. దుర్భాషలాడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మరో తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపింది. కనగానపల్లికి చెందిన సుధాకర్, రామలీల దంపతులు చెన్నేకొత్తపల్లి మండలంలోని హర్యాన్‌చెరువు వచ్చి స్థిరపడ్డారు.
కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఇద్దరు కూతుళ్లను బాగా చదివించి వివాహం చేశారు.
ఈ దంపతుల్ని ఐదారేళ్లుగా దంపతులను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
వైద్యం చేయిస్తామని.. తమతో ఉండాలని కూతుళ్లు చెప్పినా ఆ దంపతులు వినలేదు. వారికి భారం కాకూడదని భావించారు. ఇద్దరూ వారి ఇంట్లోనే ఉంటున్నారు..
కానీ వయసు మీదపడటంతో ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ఓపిక లేకుండా పోయింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.
ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. సూసైడ్ లెటర్ రాసి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
మరో వృద్ధఉడు కూడా ఇలాగే ప్రాణాలు తీసుకున్నాడు. NSP కొట్టాలకు చెందిన వెంకటరాముడికి ముగ్గురు కుమారులు.
ఐదేళ్ల క్రితం భార్య చనిపోయారు. తనకున్న పదిహేను ఎకరాల పొలం పంపకంలో దారి విషయమై కొద్దిరోజులుగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతోంది.
రెండు రోజుల క్రితం కూడా వాగ్వాదం జరిగింది.. కొడుకులు తిట్టడంతో ఆయన అవమానంగా భావించారు. తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.