బిగ్‌ బాస్‌ 4 లిస్టులో ఫేమస్‌ సెలబ్రిటీ జంట..

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 4 త్వరలోనే ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో అసలు బిగ్‌బాస్‌ ఉంటుందా లేదా అనే అనుమానాలను నివృత్తి చేస్తూ బిగ్‌ బాస్‌ షో నిర్వహకులు ఇటీవల ప్రోమో కూడా విడుదల చేశారు.

అయితే ఇప్పుడు బిగ్‌ బాస్‌లో పాల్గొనే కంటెస్టంట్స్‌ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుండగా..

విశ్వసనీయ సమాచారం మేరకు కొరియోగ్రఫర్‌ రఘు, సింగర్‌ ప్రణవీల జంటను బిగ్‌ బాస్‌ 4కు కోసం ఎంపిక చేసిట్లు తెలుస్తుంది.

ఇంకా ఈ షోలో పార్టిసిపేట్‌ చెయ్యడానికి రఘు చాలా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

బిగ్‌బాస్‌ సీజన్‌3లోనే అవకాశం వచ్చినా అప్పుడు బిజిగా ఉండటం వల్ల కుదరలేదని, ఈ సీజన్‌ వదులుకోనని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక రఘు మాత్రమే కాకుండా ఆయన భార్యను కూడా షోలోకి తీసుకోవడానికి షో నిర్వాహకులు ప్రపోజ్‌ చేసినట్లు తెలిసింది.

రఘు మంచి డ్యాన్సర్‌,ఎంటర్‌టైనర్‌ కూడా, ప్రణవి విషయానికి వస్తే గలగలా మాట్లాడగలదు.

షో కూడా రక్తి కడుతుందని నిర్వాహకులు బావిస్తున్నట్లు తెలుస్తుంది.

గత సీజన్‌లో హీరో వరుణ్ సందేశ్‌, రితికలు సందడి చేయగా ఇప్పుడు ఈ సీజన్‌లో రఘు, ప్రణవీల జంట ఆకట్టుకోనుంది.

ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ లేకపోయిన ఫిలింసిటీ వర్గాల సమాచారం మేరకు వీరిద్దరి పేరు లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సీజన్‌కు హోస్ట్‌గా కింగ్‌ నాగార్జున కన్‌ఫామ్‌ అయినట్లు తెలుస్తుంది. గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి 70 రోజులు మాత్రమే షోను టెలికాస్ట్‌ చేస్తారని గుసగుసలు వినవస్తున్నాయి.

షో నిర్వాహకులు ప్రకటించే వరకు ఇవన్నీ సోషల్‌ మీడియా ఊహాగానాలుగానే అనుకోవాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *