బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ప్రోమో రిలీజ్.. హోస్ట్ ఎవరో తెలుసా? గెట్ రెడీ ఆడియన్స్

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 4 పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అతి త్వరలో షో ప్రారంభం కానుందని పేర్కొంటూ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా యాజమాన్యం.

బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

గతేడాది భారీ రెస్పాన్స్‌తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగించిన నిర్వాహకులు తాజాగా సీజన్ 4 కోసమై అంతా రెడీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్, వీడియో ప్రోమో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికే బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై ఉండేది. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం, పరిస్థితులు తారుమారు కావడంతో కాస్త ఆలస్యమైంది.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 4 గురించి గత నెల రోజులుగా ఓ రేంజ్ వార్తలు షికారు చేస్తున్నాయి.

సీజన్ 4 హోస్ట్, కంటిస్టెంట్లు వీళ్ళే అంటూ రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో షో ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అనే క్యూరియాసిటీ బుల్లితెర ప్రేక్షకలోకంలో పెరిగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదల చేసి అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది స్టార్ మా యాజమాన్యం.

ఈ మేరకు అతిత్వరలో షో ప్రారంభం కానున్నట్లు హింట్ ఇచ్చేశారు. అయితే హోస్ట్, కంటిస్టెంట్ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.

కానీ ఇన్‌సైడ్ టాక్ మేరకు బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా మరోసారి నాగార్జుననే కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సీజన్ 100 రోజులు కాకుండా 50 నుంచి 70 రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సో.. ఎంజాయ్ చేసేందుకు గెట్ రెడీ ఆడియన్స్!!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *