కోరిన కోర్కెలు తీర్చే స్వామి చిలుకూరి బాలాజీ

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు. నిత్యం పెద్ద సంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయాoప్రసిద్ధి చెందింది.

ఇక్కడ స్వామి వారిని వీసాల బాలాజీగా కూడా పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్నరు.

చిలుకూరి బాలాజీ దేవాలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. చిలుకూరు దేవాలయం హైదరాబాదు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో .

వికారాబాద్ కి వెళ్లే మార్గంలో ఉంది. వారానికి 75 వేల నుంచి లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర, శనివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమభక్తుడైన గున్న మాధవరెడ్డి.

ఈ చిలుకూరు లో ఉండేవారు. అతను ప్రతియేటా ఎంత కష్టమైనా కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చేవారు.

వృద్ధాప్యంలో సైతం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవారు.

అలా ఒక్కసారి తిరుమలకు బయలుదేరి నా మాధవరెడ్డి. ప్రయాణంలో అలసిన కారణంగా మార్గమధ్యలోనే సొమ్మసిల్లి పడిపోయారు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో .

అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. మరలా ఇకపై నువ్వు నా దర్శనం కోసం. ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే.

నేను చిలుకూరి లో ఒక పుట్టలో కొలువై ఉన్న. వెలికి తీసే గుడి నిర్మించని చెప్పి మాయమయ్యారు అట.

నిద్ర నుంచి మేల్కొన్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు.

అంతా కలిసి వచ్చి అక్కడ ఉన్న పుట్టను గుణపాలతో పెకిలిస్తుండగా.

గుణపం బాలాజీ ఎద భాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారం అయిందంటూ అంతా ఆ దేవదేవుని క్షమాపణ కోరి.

విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయం నిర్మించారు. పూజలు చేయడం ప్రారంభించారు.

ఈ స్థలపురాణం నిజమే అనడానికి ఇప్పటికీ ఆలయంలో .

కొలువైన బాలాజీ ఎద భాగంలో గుణపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.

ఈ దేవాలయంలో 1963లో రాజలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించారు.

నాలుగేళ్ల కిందట దేవాలయం వద్ద నూతనంగా .ఆలయ గోపురాలు నిర్మించారు.

రెండేళ్ల కిందట పురాతన ధ్వజస్తంభాన్ని తొలగించి.నారేప చెట్టు తో రూపొందించిన కొత్త ధ్వజస్తంభం నిర్మించారు.

ఆపై గరుక్మంతుని గుడిని నిర్మించారు. పూలంగి ,అన్న కోట బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

ఈ దేవాలయానికి నాలుగేళ్ల కిందట స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ ఎలాంటి హుండీ ఉండదు.

నిత్య పూజా పండు కోసం భక్తులు విరాళాలు. ఇవ్వాలనుకుంటే బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ఏర్పాటు చేశారు.

ఒక కమిటీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు.

ఇక్కడ నిత్య పూజలు అంటూ ఏమీ ఉండవు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరిస్తారు.

అనంతరం భక్తులకు అనుమతినిస్తారు. భక్తులు ఆలయం చుట్టూ.

ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారు.

ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏటా చైత్ర శుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.

దర్శన సమయం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం 7 45 గంటల వరకు. స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.

బాలాజీ దర్శనానికి ఎంతటివారైనా. సాధారణ భక్తులు మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *