YS Jagan, కేసీఆర్‌కు ప్రధాని మోదీ సడన్ ఫోన్ కాల్..

కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు.

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, సీఎం జగన్సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, సీఎం జగన్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం ఫోన్‌ చేసి కరోనా పరిస్థిలను అడిగి తెలుసుకున్నారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)కు మోదీ ఫోన్‌ చేశారు.

కరోనా తీవ్రత, కట్టడిని చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.

అలాగే వైరస్‌ను నివారించడానికి పలు సూచనలు, సలహాలు సైతం ఇచ్చారు.

మరోవైపు వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న బిహార్‌, అసోం, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం ప్రధాని మోదీ మాట్లాడారు.

కరోనా వంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

కాగా, దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌ మం‍త్రాన్ని పాటిస్తున్నాయి.

అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు 50 వేలకు చేరువలో ఉన్నాయి. ఏపీలో అయితే ఆదివారం ఒక్క రోజే ఏకంగా 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 56 మరణాలు సంభవించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *