పొన్నాల- బడ్జెట్ బండారాన్ని బయటపెట్టిన

● ఈసారి వాస్తవిక బడ్జెట్ ఉంటుందని ప్రచారం చేసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు…
● మరి గత అయిదు సంవత్సరాల నుండి ప్రవేశపెట్టిన బడ్జెట్ అవాస్తవమైనదా?
● ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి,కష్టాలలో ఉన్నామని చెప్పి మళ్లీ అవాస్తవమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు…
● పద్దెనిమిది నెలలుగా ఆర్థికమాంద్యమని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ… అయిదు మాసాలకింద ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారు…
● దేశంలో తగ్గుతున్న ఆర్థిక వృధ్ధిరేటు గురించి ఆర్థికమాంద్యం గురించి బలహీన పడుతున్న పారిశ్రామికరంగం గురించి తెలిసి 1,82,000 కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు?
అయిదు నెలల్లోనే కుదించి 36,000 కోట్లు తగ్గించి 1,46,000కోట్ల బడ్జెట్’ను ఈరోజు ప్రవేశపెట్టారు…
● ఈనాటి బడ్జెట్
ఒక ‘అంకెల గారడి’…
● అయిదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాదించమంటున్నారు
కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టు లన్ని ఎక్కడివక్కడనే ఉన్నాయి…
8,500 కోట్లు ఖర్చుపెడితే 32 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితిని పక్కనపెట్టి కొత్త వాటిని మొదలుపెట్టారు.
● వాస్తవమని చెప్పి 1,82,000 కోట్లను 1,46,000 కోట్లకు తగ్గించిన తర్వాత కూడా లోటు 24,000 కోట్లు అంటున్నారు
అంటే ఖర్చు పెట్టేది 1,22,000 కోట్లు ఇందులో నుండి పాతబకాయిలు 31,000 కోట్లు తీసేస్తే 91,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టే అవకాశముంది…
● రాష్ట్ర రెవెన్యూ ఖర్చు 1,11,000 కోట్లు అత్యవసర చెల్లింపులు,జీతాలు, పెన్షన్లకే సరిపోదు కదా!
ఇలా ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారు?
● మీరు చాలా వాగ్ధానాలు చేసారు కదా!
- పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తామన్నారు బడ్జెట్’లో…
- నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించలేదు
- ఋణమాఫీ గురించి ఏమి మాట్లాడలేదు
- వడ్డీ విషయం ప్రస్తావించ లేదు
- గత నాలుగున్నరేళ్లలో ఏనాడు కూడా రైతులకు వడగండ్లు,కరువు, మిగతా వైపరీత్యాలకు పంటనష్ట పరిహారం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..
- రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
కేసీఆర్ ప్రభుత్వం…
నేటి మీ పాలనలో…
- అంగన్వాడీ కేంద్రంలో పాలు దొరకని పరిస్థితి
- ఆరోగ్యశ్రీ బకాయిలు , ఫీజు రీ-ఎంబర్స్మెంట్ వేల కోట్లకు చేరాయి
● ముఖ్యమంత్రిగారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను
చెరువుల వల్ల వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందంటున్నారు
ఏ ఊరికైనా పోదాం మీ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుంటే నీటి నిలువలు ఏ మేరకు ఉన్నాయో చూద్దాం…
● ఇరవైనాలుగు గంటలు కరెంటు ఇచ్చి, చెరువులు బాగుచేసి నీటి నిలువ చేసి, రైతులను ఆదుకుంటే నేను అడుగుతున్నా
2013-14లో కాంగ్రెస్ ప్రభుత్వం 7 గంటల కరెంట్ ఇస్తే 107 లక్షల టన్నుల ఆహారధాన్యాలు దిగుబడి వచ్చింది. మరి మీ మిషన్ కాకతీయ ద్వారా ఎంత వచ్చిందో చర్చిద్దాం ( మీ పాలనలో 102 లక్షల టన్నుల దాటలేదు కదా! )
దమ్ముధైర్యముంటే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడండి…
● మీ నమ్మబలికే పద్దతిని ప్రజలు త్వరలో గ్రహిస్తారు
- మీరు శాశ్వతం కాదు
- మిగులు రాష్ట్రాన్ని అప్పులరాష్ట్రంగా చేసిన మీ జిత్తులమారి నాటకాలు,
వినయాలను తెలంగాణ సోదరసోదరీమణులు
అర్థం చేసుకొని ఆలోచించాలని కోరుకుంటున్నాను…