రామారావు 100 వ సినిమా – గుండమ్మ కథ – June 7, 1962

Gundamma Katha | 1962 Telugu HD Full Movie
తీరికగా కూర్చొని డి.వి.నరసరాజు గారు విజయా వారి ‘గుండమ్మ కథ’ చిత్రానికి సంభాషణలు వ్రాయడం మొదలుపెట్టారు . ఓ సీన్ లో ఏఎన్నార్ గుండమ్మ ఇంటికి వచ్చి , మారువేషంలో అంజి గా వున్న అన్న ఎన్టీఆర్ ను తన ప్రేయసి ఇంట్లోనే వుందా అని అడగాలి . ” నా ప్రేయసి ఇంట్లోనే వుందా ” అని వ్రాసారు. కానీ నరసరాజు గారికి ప్రేయసి అనే పదం బరువుగా అనిపించి ” నా పిట్ట వుందా ” అని మార్చారు. మళ్ళీ “పిట్ట” అనే పదం మరి చీప్ గా వున్నట్టు అనిపించి కొట్టి వేశారు . సరైన మాట ఏమిటా అని ఆలోచిస్తూ , ఇంట్లో ఆమె వుందా అనే అర్ధం స్పురించేలా ఏఎన్నార్ ఈల తో అడిగినట్టు, , వెంటనే వుంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ సమాధానం చెప్పినట్టు వ్రాసుకున్నారు. ప్రొడక్షన్ కార్ వచ్చింది. స్క్రిప్ట్ ను చంకన పెట్టుకొని స్టూడియోకి వచ్చి నిర్మాత చక్రపాణి గారికి చూపించారు. ఆయనకు విజిల్ సంభాషణ బాగా నచ్చింది. సీన్ లోని మిగతా భాగం కూడా విజిల్స్ తోనే కొనసాగించమని చెప్పారు.
“చిత్రం – విజయా వారి గుండమ్మ కథ”
నరసరాజు గారు అలాగే వ్రాసారు. సినిమా హాళ్లలో జనం ఈ విజిల్ సంభాషణను చూసి , చప్పట్లు, ఈలలతో అభినందించారు. రాసేటప్పుడు సరిఅయిన మాట దొరకక , విజిల్స్ ను ఆశ్రయిస్తే , ఆ సీన్ సూపర్ హిట్ అయ్యింది. .ఈ సన్నివేశం తరువాత ” కోలొకోలో యన్న ” అనే పాట వస్తుంది. ఈ పాట వెనుక ఒక విశేషం వుంది. అందరు నటీనటులకు ఒకే రోజు వీలుకానందువల్ల , ఎన్టీఆర్, సావిత్రి గారి తో ముందు చిత్రీకరించి , 15 రోజుల తరువాత నాగేశ్వర రావు జమునల మీద చిత్రీకరించారు . తరువాత చక్రపాణి, దర్శకుడు కమలాకర కామేశ్వర రావు , ఎడిటర్ కల్యాణ సుందరం గారు కలసి ఎడిటింగ్ మాయతో పాట అంతా ఒకేసారి తీసినట్టు మాయ చేసారు . ఇలా ఈ సినిమాలో బోలెడు విశేషాలు వున్నాయి . ఈ రోజు ఆ సన్నివేశాన్ని , పాట ను చూడండి . స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టారు గారు గానం చేయగా, గాయనీమణులు రాగాలు ఆలపించారు.