మోదీ రిజర్వేషన్ల మోత

Modi - 10% reservation bill
అగ్రవర్ణ పేదలకు మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించింది. అన్ని మతాల్లోనూ పేదలు ఈ కోటకు అర్హులే ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గాలకు 49.5 శాతం ఉండగా అదనంగా 10 శాతం కోటాను అగ్రవర్ణ పేదలకు కల్పించనుంది.
రిజర్వేషన్లు 60 శాతం చేరనున్నాయి రిజర్వేషన్ ఇచ్చేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల ఆధిక్యతతో ఆమోదించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు రాజ్పుత్, మరాఠీ, తదితర కులాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
15, 16 అనుసరించడం ద్వారా రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. బిల్లును పార్లమెంట్లో ఆమోదించాక రాజ్యాంగాన్ని సవరించి అగ్రా కులాలలోని పేదలకు రిజర్వేషన్ కల్పిస్తామని. అంటోంది బీజేపీ మిత్రపక్షం ఎల్ జి పి అధ్యక్షుడు దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఎన్నో లక్ష్యాలకు గురిపెట్టే బాణాన్ని మోదీ ప్రభుత్వం సంధించింది మరో 90 రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణ మార్చే నిర్ణయాన్ని వెలువరించింది.
చట్ట పరంగా ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికీ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రిజర్వేషన్లు కల్పనకు కులం ప్రాతిపదిక కాకపోవడం గమనార్హం ఆర్థికంగా వెనకబడిన వర్గం ఎకనామికల్ వీకర్ సెక్షన్ ల పేరుతో అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. ప్రధాని మోదీ నిర్ణయం విప్లవాత్మకమైనది. కాపు బ్రాహ్మణ వైశ్య , రెడ్డి, కమ్మ కులం లో పేద వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు లభిస్తాయి.