కూటమిలో కుంపటి

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి అనేది మొదటి నుంచి ఒకటి ఉంది. గత టర్మ్ లో యూపీఏగా దేశాన్ని ఎన్నిక కూటమి.. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం కూడా అలాగే తన ఉనికిని కాపాడుకుంది. దేశవ్యాప్తంగా యూపీఏ కూటమిలోని పార్టీలు చిత్తు చిత్తుగా ఓడిన… రాజ్యసభలో వీళ్ళు బలం గట్టిగా నిలిచింది. లోక్సభలో వీళ్ళు బలం తక్కువే అయినా రాజ్యసభలో వివిధ బిల్లుల విషయంలో మోడీకి చుక్కలు చూపించారు.

రాజ్య సభ లో తాము అనుకున్న బిల్లులు పాస్ కావడానికి బీజేపీ వాళ్లు చాలా పాట్లు పడ్డారు. అలా బీజేపీ వైరి పక్షం సత్త చాటు కున్నప్పుడు. బీజేపీ పంచ లోనే ఉండి నాడు చంద్రబాబు నాయుడు… అయితే ఇప్పుడు తనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పరచి నట్టుగా చెప్పు తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు బీజేపీ కి వ్యతిరేక కూటమి అని ఏ ముహూర్తాన అన్నాడో కానీ….

ఇప్పుడు కూటమిలో లుకలుకలు బయట పడుతు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు వచ్చాయి. కూటమిలోకి చంద్రబాబు ఇన్ అన్న వేళా విశేషం. పలు పార్టీలు కూటమి నుంచి ఔట్ అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అవి దూరం జరిగాయి. మూడు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు హాజరు అవుతున్న అవుతాను అన్నాడు కదా.. ఇదే సమయంలో ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం లేదని సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ప్రకటించాయి. అంతేకాదు.. యూపీలో ఆ పార్టీలు పొత్తు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి.

కాంగ్రెస్ కు వీసవెత్తు విలువ ఇవ్వకుండా సీట్ల నెంబర్లను ఆ పార్టీలు ప్రకటించుకున్నాయి. 37 సీట్లలో బీఎస్పీ, ఆర్ఎల్డీ మూడు సీట్లలో పోటీ చేయనున్నట్లు గా ఆ పార్టీలు ప్రకటించుకున్నాయి. రెండు సీట్లను మాత్రం ఆ పార్టీలు వదిలాయి. వాటిలో ఒకటి రాహుల్ సీటు, మరొకటి సోనియా సీటు. పొత్తు కావాలి అనుకుంటే ఆ రెండు సీట్లలో పోటీ చేసుకోవచ్చని లేకపోతే ఆ రెండింట్లో కూడా తాము చెరో చోటు పోటీ చేస్తామని ఎస్పీ బీఎస్పీలు స్పష్టంగా ప్రకటించాయి ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే ఆ పార్టీకి అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. ఒప్పుకోకపోతే ఎస్పీ బీఎస్పీలు ను దూరం చేసినట్టుగా అవుతుంది. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని తృణమూల్ కాంగ్రెస్, ఎన్నీపీలు తప్పు పడుతున్నాయి.

ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఏమిటి? అని ఆ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రాహుల్ ప్రధాని అభ్యర్థి తత్వానికి చంద్రబాబు తెలుపుతున్న.. మిగతా పార్టీలు ఒప్పుకోవడం లేదు. బాబు బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరిపోయా కి అక్కడ ఇలాంటి లొల్లి అంతా మొదలవ్వడం విశేషం.. ఆర్ ఎల్ డీకి మూడు సీట్లు కేటాయించటం , సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, రాయబరేలి, అమేధీ సీట్లు వదిలివేయటం ఇతర ప్రతిపక్షాలను గందరగోళంలో పడి వేసింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ రెండు పెద్ద పార్టీలు మహాకూటమిలో చేరకపోతే తమ పరిస్థితి ఏమిటి అన్నది వారి ప్రశ్న. మాయావతి అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉండే పక్షంలో నరేంద్ర మోదీని ఓడించడం అసాధ్యం అనే భావన వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *