చంద్రబాబును రిటర్న్ గిఫ్ట్ అంటే ఉలుకెందుకో! అంటున్న జగన్ మరియు కేసీఆర్ పాటు” బాబు పై ప్రకృతి కూడా ఆగ్రహిస్తుంది”

YS Jagan Reaction On KCR Return Gift || Latest Telugu News ||
1. ఆంధ్రప్రదేశ్ కు వస్తాం, చంద్రబాబు కథనాల్ని బయట పెడతాం, ఆయనకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే... కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు కవరింగ్ మొదలుపెట్టారు..
బీద అరుపులు ప్రారంభించారు. ఇప్పుడే రిటర్న్ గిఫ్ట్ అంశంపై వైఎస్ఆర్సీ అధినేత జగన్ కూడా స్పందించారు... రిటర్న్ గిఫ్ట్ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని బాబును డిమాండ్ చేశారు."
చంద్రబాబుకు బుద్ధి చెప్పడం కోసం టిఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ కు వస్తామని ప్రకటించారు. వాళ్లు ఇలా ప్రకటించిన వెంటనే ఊసరవల్లి కంటే స్పీడ్ గా చంద్రబాబు రంగులు మార్చారు. ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించింది, ఇలాంటి పార్టీ ఏపీకి రావడం ఏంటి ప్రతిపక్షం తో కలిసి పని చేయడం ఏంటి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ అడ్డుకుందని చంద్రబాబు భావిస్తే అదే టీఆర్ఎస్ తో పొత్తు కోసం హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా చంద్రబాబు ఎందుకు ప్రయత్నించారు?"
2. ” ఇలా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు జగన్”
భారీ బహిరంగ సభలో మాట్లాడిన జగన్… చంద్రబాబు ఉన్న రెండు నాలుకల ధోరణి ఎండగట్టారు. ఒకప్పుడు టిఆర్ఎస్ ను తిట్టిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల కోసం అదే పార్టీతో పొత్తు కోసం అర్రులుచాచారని విమర్శించారు….అదలా ఉంటుండగా బాబు పై ప్రకృతి కూడా ఆగ్రహిస్తుంది
“కొందరిని ప్రకృతి కరుణించదు”.. “కొందరు పై ప్రకృతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది”. వారి వద్ద కూడా తనకు ఇష్టం లేనట్లుగా ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు విషయంలో ప్రకృతి ఎప్పటికప్పుడు తన ఆగ్రహాన్ని అనురాగాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది.
ఎందుకో ఏమిటో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” అంటే ప్రకృతికి ప్రకోపం ఎక్కువే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే “అతీవృష్టీ” లేకపోతే “అనావృష్టి” వర్షాలు కురియ వలసిన సమయం లో అవి లేవు… పంటలు ఎగువ పండిన తరువాత పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు.. సమైక్య రాష్ట్రంలో ను…. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే జరిగింది..
మొత్తానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ప్రకృతి ప్రకోపం మాత్రం తగ్గడం లేదు.
ప్రకృతి కోపమే తగ్గటం లేదు. అలాంటిది ఇతర పార్టీల కోపాలు ఎలా తగ్గుతాయి ఇక వేచి చూడాలి రానున్న ఎన్నికల్లో ఏ నాయకత్వం గెలుస్తుంది.