KCR out ranks CBN smartness

ప్రత్యేక ప్రతినిధి:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద శిష్యరికం చేసిన రాజకీయ చాణక్యం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నాలుగాకులు ఎక్కువే చదివారు….. తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలకు కొత్త ఒరవడి తీసుకువచ్చారు. ఆయన కుటుంబాన్ని రాజకీయాల్లో హైలెట్ చేస్తూ తెలివిగా వ్యవహరించారు. తాజాగా తన పుత్రరత్నం కేటీయార్ని పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ గా నియమించి భావి మహారాజు ఆయనేనని చెప్పకనే చెప్పసారు. ఇక మరో ఆరు నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఏంటన్నది చూసుకొని ఢిల్లీలో కేసీయార్ చక్రం తిప్పుతారని తెలుస్తొంది. ఇక తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీయార్ కూడా తాజా ఎత్తుగడతో తెలుస్తుంది. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే నైపుణ్యంలో కెసిఆర్ రాజకీయాన్ని కాపీ కొడుతున్న నలభయ్యేళ్ళ ఇండస్ర్టీ చంద్రబాబు కూడా తెలంగాణపరిణామాలను చూసి తొందరపడతారని అంటున్నారు. అక్కడ కేటీయార్నిని మంత్రిని చేస్తే ఇక్కడ లోకేష్ని మంత్రని చేశారు. అక్కడ కేటీఆర్ చేపట్టిన శాఖలనే ఇక్కడ లోకేష్ కు కూడా కట్టబెట్టి సమన్యాయం చేశారు. అక్కడ ఇప్పుడు పార్టీ మొత్తం కేటీయర్కీ రాసి ఇచ్చేశారు. ఇక సీఎం సీటు కూడా ఆయనకేనని తేలిపోయింది . దాంతో తెలుగుదేశం రాజ భక్తులు తమ యువరాజు లోకేష్కు ఆ మంచి రోజులు ఎపుడా అని తొందర పడుతున్నారు. నిజానికి తెలుగు దేశంలో ఇప్పటికే పార్టీలో అత్యున్నత పదవిని చంద్రబాబు లోకేష్ కు అప్పగించారు. తండ్రి రాజకీయ పార్టీలకు అధ్యక్షుడు కుమారుడు ప్రధాన కార్యదర్శిగా ఉంటున్న టిడిపిలో లోకేష్ కు కొత్తగా ఇచ్చేది, పంచుకునేది ఇక్కడ ఏమీ లేదనే చెప్పాలి. ఇక మిగిలిందేంటంటే ముఖ్యమంత్రి పీఠం . అది ప్రస్తుతం చంద్రబాబు చేతిలో ఉంది. బాబుకు రేపు ఢిల్లీ స్థాయిలో కొత్త ఉద్యోగం కుదిరితే ఇక్కడ చిన