KCR back to work!

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తన దీర్ఘకాలిక ప్రణాళికలో తదుపరి దశ ఆమలకు శ్రీకారం చుట్టారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 24 గంటల లోపే కుమారుడు కె.టి. రామారావును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. తను భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తలమునకలైతే రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను పాలన బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించానున్నారనే స్పష్టత అప్పటికే పార్టీలోనే ముఖ్య నాయకులుకు ఉంది. అందువల్ల కేటీఆర్ కు పార్టీలో అధికారికంగా ద్వితీయ స్థానం ఇవ్వడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.2019 ఎన్నికల నాటికి జాతీయస్థాయి వెళ్లేందుకు అనువైన పూర్వరంగాన్ని ఏర్పరుచుకోవడం కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఒక ప్రధాన కారణం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సానుకూల ఓట్లతో తెరాసకు ఘనవిజయం దక్కుతుందని ఆయన నమ్మారు.
దీనికి తగినట్లుగా కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అధిక శాతం ప్రజానీకం బలంగా కోరుకుంది లేకపోతే ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కావేమోనని, పథకాలు అమలు కావేమోనని భావించింది. తెలంగాణ భవనాలకు రాజకీయ రూపం తెరాసేనని చాలామంది మదిలో నాటుకుపోయింది ఇక 14 15 ఏళ్ల వయసులో తెలంగాణ ఆవిర్భావాన్ని చూసి ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు ఉపయోగించుకున్న యువతులో కేసీఆర్ పట్ల విపరీతమైన అభిమానం కనిపించింది. అందుకే అనేక చోట్ల తెరాస పార్టీ అభ్యర్థుల పట్ల అసంతృప్తి ఉన్న దాన్ని పక్కన పెట్టి మరీఓటర్లు కారు గుర్తు వైపు మొగ్గుచూపారు . తెరాస 88 స్థానాల్లో విజయం సాధించగా, వాటిలో ఆ పార్టీ సగటున 32,661 ఓట్ల ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ గెలిచిన 19 స్థానాల్లో సగటుదువల్లే కావచ్చు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసినప్పుడు తనతోపాటు ఒకరిని మంత్రిగా ప్రమాణం చేయించేందుకు మహమూద్ అలీ ని ఎంచుకున్నారు.