అమెరికాలో కాల్పులు… తెలంగాణ వ్యక్తి దుర్మరణం

అమెరికాలో తుపాకీ కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. తెలంగాణకు చెందిన గోవర్ధన్ రెడ్డి ఫ్లోరిడాలో దుండగులు కాల్చి చంపారు.

డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తోన్న కొత్త గోవర్ధన్ రెడ్డితోపాటు మరో వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు

దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు అతడి కుటుంబీకులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

యాదాద్రి జిల్లా ఆత్మకూరు‌ మండలం రహీంఖాన్ పేటకు చెందిన గోవర్ధన్ ఏడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు.

గత ఏడాది నవంబర్లో అమెరికాలోని న్యూజెర్సీ తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు.

మెదక్‌కు చెందిన సునీల్‌ ఎడ్లాను వెంట్నార్‌ సిటీలో ఆయన ఇంటి ముందే 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు.

ఆఫీస్ నుంచి ఇంటి వచ్చిన సునీల్‌పై కాపుగాసి మరీ ఆ బాలుడు కాల్పులు జరిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *