అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం!

చరిత్రలోనే బుధవారం చీకటి రోజు, హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం.
ఈ ప్రమాదంలో సుమారు మూడు వందల దుకాణాలు కాలిపోయాయి. దాదాపుగా 40 కోట్ల ఆస్తి నష్టం జరిగింది.
ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గతంలో ఎన్నడూ జరగని ఇలాంటి సంఘటనపై ,సందర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇంత భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు. మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది.

ఎగ్జిబిషన్లో సొసైటీ పాలకమండలి లో నెలకొన్న అభిప్రాయబేధాలు, విభేదాలు వలన ఎవరైనా కావాలనే, ఈ దూరగతనికి పాల్పడి ఉంటారా? అని అనుమానాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర కూడా జరిగి ఉండవచ్చునని అంటున్నారు. ఈ కోణంలో పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.
కొంతకాలంగా పాలకమండలిలో అభిప్రాయబేధాలు దుమారం లేపుతున్నాయి. ఈసారి భారీ ఎత్తున నిర్వహించే విషయంలో తమ మాటే నెగ్గేలా, తమ వర్గానికి కీలక బాధ్యతలు లభించేలా, కొందరు ప్రయత్నాలు చేసి విఫలం అయినట్లు సమాచారం.
సొసైటీ నేతల రాజకీయాల వలన కూడా ప్రమాదం కారణం కావచ్చు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విభేదాలు ఎన్ని ఉన్నా. సొసైటీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించారని అంటున్నారు.
లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా కొందరు ప్రయత్నం చేస్తుంటారు. ఈ తరహా ఆలోచనలు రావడం కూడా సరికాదు.