మీకోసమే నేను వచ్చాను అంటూ నిజామాబాద్ జిల్లా ప్రజల మనసు దోచుకుంటున్న తందూరి చాయి

Tandoori Chai, Smoky Flavored Tea
ఇతవరకు మనకు తందూరి రోటీ , తందూరి చికెన్ మాత్రమే తెలుసు తందూరి చాయి కూడా ఉంటుందని ఊహించడమే కష్టం మరి విశేషలు తెలుసుకోవాలంటే నిజామాబాద్ వెళ్లాల్సిందే. ఎందరికో ప్రీతికరమైన చాయిలు ఎన్నో రకాలు ఉన్నాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఎల్లో టీ, హెర్బల్ టీ. ఇలా పలురకాల చాయిలు మనకు తెలిసిన్నవే. ఇప్పుడు మరో రకమైన చాయ్ అందుబాటులోకి వంచిది అది వినడానికి విచిత్రంగా కొంచెం కొత్తగా అనిపించినా ఇది ఇప్పుడు నిజామాబాదు వాసులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొలిమి లోంచి వేడి వేడి గా తీసిన మట్టి కుండ అందులో బుసబుసలాడుతూ మట్టి పరిమళం తో వోంగే తందూరి చాయ్ కోసం లొట్టలు వేయవలసిందే.
నిజామాబాద్ జిల్లా ఆర్య నగర్ కు చెందిన సంజయ్ ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ తందూరి చాయి. సంప్రదాయ పద్ధతులకు ఆధునికతను జోడించి తందూరి చాయ్ రుచిని నగరవాసులకు అందిస్తున్నాడు సంజయ్. నగరంలోని కంఠేశ్వర్ వద్దా తందూరి శైలిలో చాయ్ తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు.
ముందుగా తందూరి పోయి లో మట్టి కప్పులను వేడి చేస్తావా తర్వాత సగం మరిగించిన టీనీ తందూరి పోయిన తీసిన మట్టిపాత్రలో పోతారు. నిప్పుల కొలువులో కాలిన మట్టి కుండలో పోయగానే తిను రగులు కక్కుతూ పొంగుతుంది. అలా ఇత్తడి పాత్రలు పొంగిన టీని మరో మట్టిపాత్రలో పోసి అందిస్తారు ఇలా తందూరి చాయ్ తో పాటు తందూరి పాలు , తందూరి కాఫీ, తందూరి గ్రీన్ టీ పాటు రకరకాల చాయ్ లను అందిస్తున్నాడు.
ఇప్పుడున్న ఆధునిక కాలంలో రకరకాల టీ లు వస్తున్నాయి మసాలా టీ గ్రీన్ టీ అంటూ రంగులు వేస్తూ జనాలను మోసం చేస్తున్నారు అలా కాకుండా పాత కాలంలో లాగా మట్టి పాత్రను పాత రోజులను గుర్తు చేసుకుంటూ ప్రజలు హాయిగా జీవించడం అనేది జరగాలి అంటూ సంజయ్ అన్నారు. మేము ఇప్పటివరకు ఎటువంటి కలర్స్ ఎటువంటి నాణ్యతలేని పాలను కలపలేదు, కలపాము తెలంగాణలో ఇప్పటివరకు ఇటువంటి చాయ్ షాప్ ఎక్కడా లేదు ఇదే మొదటి తందూరి చాయ్ షాప్ ఉంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు సంజయ్. ఒక్కక కప్పు చాయి 20 రూపాయలు అయిన సాధారణ టీ తో పోలిస్తే ధర రెట్టింపైన, చాయ్ ప్రియులు ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. మట్టి కప్పు వాసనతో చాయి మరింత రుచిగా ఉంటుందని పాతకాలం నాటి మధురమైన రుచి లభిస్తుందని అంతున్నారు నిజామాబాద్ లో ఏ నోట విన్నా తందూరి చాయ్ గురించి ముచ్చటిస్తున్నారు. మట్టిలోని కమ్మదనాన్ని తందూరి చాయి ద్వారా పొందుతున్న చెబుతున్నారు.