కెసీఆర్ మరియు జగనే అనుకుంటే ఇప్పుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి “అంబటి రాంబాబు “కూడా చంద్రబాబు ను విమర్శిస్తున్నారు..

ambati rambabu vs chandrababu naidu

  1. కేటీఆర్ చంద్రబాబు మధ్యలో లగడపాటి.
  2. టిఆర్ఎస్ తో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాట.
  3. పిలవకపోయినా కేసీఆర్ యాగానికి బాబు వెళ్లొచ్చారు.
  4. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ను ఆహ్వానించారు.
  5. శివాజీ లగడపాటి చంద్రబాబు ప్రయోగించిన అస్ర్తాలే:ముఖ్యమంత్రి చంద్రబాబువి పచ్చి అవకాశవాద రాజకీయాలని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారుచంద్రబాబు పతనం హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది అన్నారు . అంబటి రాంబాబు విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతోఇలా మాట్లాడారు.
  6. టిఆర్ఎస్ తో పొత్తు కు వెంపర్లాడింది చంద్రబాబు కాదా ? అని ప్రశ్నించారు. ‘ మా పుట్టలో వేలు పెడితే… మీ పుట్టలో కాలు పెడతామని’ కేటీఆర్ అంటే దానికి తమకు ఆపాదిస్తారా ? అంటూ ధ్వజమెత్తారు . కేసీఆర్ ను అమరావతి శంకుస్థాపనకు పిలిచింది మీరు కాదా , మిమ్మల్ని పిలవకపోయినా కేసీఆర్ చేసిన యాగానికి ఎగేసుకొని వెళ్లింది నిజం కాదా అని అంబటి నిలదీశారు.

కేటీఆర్ కు, చంద్రబాబుకు మధ్య లగడపాటి రాజగోపాల్ బ్రోకర్ పనిచేశారని అన్నారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ భౌతికకాయం వద్ద టీఆర్ఎస్ నేత కేటీఆర్ తో చంద్రబాబు పొత్తు గురించి మాట్లాడారని టిఆర్ఎస్ ఛీ… పో… అన్న తర్వాతే ఆయన కాంగ్రెస్ తో పొత్త పెట్టుకున్నారని గుర్తు చేశారు.

కన్నీటికి కారణమైన కాంగ్రెస్ తో పొత్తు?
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నీటికి కారణమైన పార్టీ కాంగ్రెస్ అని అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని అంబాటీ మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తానే కారణమని చంద్రబాబు చెబుతున్నారని మరి ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా చంద్రబాబు వల్లే తాము గెలిచామని ఎందుకు చెప్పడం లేదన్నారు. చంద్రబాబు దోచుకున్న సొమ్ముతో కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పట్టారన్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు అశోక్ గెహ్లోత్ డబ్బు గురించే అమరావతికి వచ్చారని విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా దాచుకున్న అవినీతి డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు…..

ఎల్లో మీడియాకే బాబు గొప్ప
ఎల్లో మీడియాకు మాత్రమే చంద్రబాబు కొత్తగా కనిపిస్తున్నారని , నాలుగున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఏం చేయకపోయినా ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు అన్నా ఆయనకు అనుకూలంగానే కథనాలు రాసిందని అంబటి అన్నారు. ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబు నేను అని చెప్పారు. ఎన్నికల చివర విషయాల్లో తెలంగాణ ప్రజలు మనసులు మార్చడానికి లగడపాటి రాజగోపాల్ ను చంద్రబాబు ప్రయోగించారన్నారు. నటుడు శివాజీ లగడపాటి ఇద్దరు చంద్రబాబు ప్రయోగించిన అస్ర్తాలేనని చెప్పారు. ఇప్పటికే శివాజీ అమెరికా పారిపోయాడని . అలాగే దివాలా తీసిన రాజగోపాల్, దోచుకున్న సొమ్ముతో సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా దేశం విడిచి పోతున్నారని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *