మానవత్వానికే మాయని మచ్చగా …..ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.

తెలంగాణలో దారుణ ఘటన.. బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారం
ఏడేళ్ల కుమార్తెకు సోమవారం జ్వరం రావడంతో మందులు వేసి పడుకోబెట్టింది. అనంతరం సమీపంలోని పొలంలోకి పనికి వెళ్లింది.
ఈ విషయాన్ని పసిగట్టిన పక్కింటి యువకుడు ఇంట్లోకి దూరి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తెలంగాణలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మానవత్వానికే మాయని మచ్చగా నిలిచి ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో సోమవారం జరిగింది.
అశ్వారావుపేట పట్టణంలో భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కనే లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు(23) ఉంటున్నాడు.
అతడు కొన్నాళ్లుగా ఎయిడ్స్ వ్యాధితో భాధపడుతున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో మహిళ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ అప్పుడప్పుడూ టీవీ చూసేందుకు వచ్చేవాడు.
ఆ మహిళ తన ఏడేళ్ల కుమార్తెకు సోమవారం జ్వరం రావడంతో మందులు వేసి పడుకోబెట్టింది. అనంతరం సమీపంలోని పొలంలోకి పనికి వెళ్లింది.
ఈ విషయాన్ని పసిగట్టిన పక్కింటి యువకుడు ఇంట్లోకి దూరి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో బాలిక తల్లి ఇంటికి వచ్చి ఆ ఘోరాన్ని చూసి కేకలు వేసింది. దీంతో ఆ కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక దాడి కేసులను నమోదు చేసినట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు.
వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.