తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి…

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
టీఆర్‌ఎస్ నుంచి నలుగురు అభ్యర్థులు, ఎంఐఎం నుంచి ఒక అభ్యర్థి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక లాంఛనమే అయింది.
టీఆర్‌ఎస్ పార్టీ తరఫున బరిలో దిగిన నలుగురు అభ్యర్థులతో పాటు, ఎంఐఎంకు చెందిన మరో అభ్యర్థి విజయం సాధించారు.
వీరిలో టీఆర్‌ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం ఉండగా.. మజ్లిస్ పార్టీ నుంచి మీర్జా రియాజ్ హసన్ ఉన్నారు.
అసెంబ్లీ కమిటీ హాల్-1లో మంగళవారం (మార్చి 12) ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
91 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించింది.
మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ఈ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించింది.
కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు దూరంగా ఉండటంతో ఐదుగురు అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. ముగ్గురు అభ్యర్థులకు 20, మరో ఇద్దరు అభ్యర్థులకు 19 చొప్పున ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు శశాంక్ గోయల్ పరిశీలకుడిగా వ్యవహరించారు.