ఆయన మగాడు (మోడీ) రా బుజ్జీ

ఏళ్ళ తరబడి నానుతున్న కాశ్మీర్ సమస్యని సరిగ్గా 24 గంటలు గడవకముందే తేల్చేసిన మోడీ యంత్రాంగం… ప్రపంచం మొత్తం నివ్వెరపోయేట్టు, ప్రతిపక్షం అదిరిపోయట్టు మోడీ వేసిన ఎత్తుగడ రాజకీయ విమర్శకులను సైతం విస్తుపోయేలా చేసింది.

మీ సమస్యని మేం పరిష్కారం చేస్తాం అని భుజాలు తడుముకుంటూ ట్రంపెట్ వాయించిన ట్రంపును, చాప కింద నీరులా ఎగబాకుతున్న చైనా చింకితనాన్ని, మరీ ముఖ్యంగా పగటి వేషాలు వేసే పాకిస్తాన్ను ఒకే ఒక దెబ్బతో మట్టి కరిపించిన మన నాయకుడు మోడీ.

డెబ్భై ఏళ్ళ క్రితం రాసుకున్న రాజ్యాంగం గురించి నిజంగా నేటి తరానికి సరిగ్గా తెలీదనే చెప్పాలి.  ఈ రోజు వార్తలను చూసి నిజంగా అటువంటి రాజ్యాంగం ఒకటుందా అని ముక్కున వేలేసుకున్న మొహాలే ఎక్కువ కనబడుతున్నాయి.  కాశ్మీర్ సమస్య భారత్ కు పట్టి పీడిస్తున్న జాడ్యం, దానికి కారణం నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వైఫల్యం. 

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది నేతలు వచ్చినా కనీసం సమస్య పరిష్కారానికి కాసింతైనా అడుగు ముందుకు వేయడానికి ధైర్యం చేయలేదు.  అలాంటిది ఎంతో వ్యూహాత్మకంగా, చాకచక్యంగా మోడీ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.  కాశ్మీర్ సమస్య పై తీసుకున్న నిర్ణయం వల్ల పక్కనున్న పాకిస్తాన్ అరవడం పరిపాటే కాని దేశంలోవున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరియు కాశ్మీర్ ప్రాంత పాలిత నాయకులు అక్కసు వెళ్ళగక్కడం నిజంగా దరిద్రం. 

దేశ పౌరుడన్న ప్రతివాడు ఆహ్వానించదగ్గ పరిణామాన్ని కొన్ని రాజకీయేతర శక్తులు, స్వార్ధపూరిత సంఘాలు వేలు చూపితే అది వారి ఉనికికే ప్రమాదం అన్న విషయాన్ని వారు గ్రహించాలి.  అసలు మన దేశంలోని భాగమైన మన ప్రదేశాన్ని మనది అనుకునే నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మనసెలా వస్తుంది. దేశ ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికలలో స్వచ్ఛమైన నిర్ణయాన్ని వెలిబుచ్చారన్నది నేటి ఉదంతంతో ప్రపంచానికి తెలిసింది.

భారతదేశం నిజమైన స్వాతంత్రాన్ని సాధించిన రోజు ఈ రోజు. నరనరాల్లో దేశభక్తి నిండిన నిజమైన నాయకుడు మనకోసం నేడున్నాడు. నాటి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాటాన్ని చవి చూశాం, కాని నేటి నవభారత నిర్మాణానికి రొమ్మువిరిచి నిలబడ్డ యోధుడు మన ప్రధాన నాయకుడు.

ఆఖరుగా ఒక్క మాట, ఒక సైనికుడు తన జీవితాన్ని పణంగా పెట్టి కంటి మీద కునుకు లేకుండా అహర్నిశలు దేశ రక్షణ కోసం సరిహద్దులో కాపలా కాస్తాడు, అదే సైనికుడు దేశ నాయకత్వం వహిస్తే ఎలా ఉంటుందో చేసి చూపారు మన భారత ప్రధామంత్రి మోడీగారు. నిజంగా ఆయన మాగాడ్రా బుజ్జీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *