పవన్ ని తనలో కలిసి పొమ్మంటున్న పాల్

రాబోయే ఎన్నికల దృష్ట్యా వివిధ పార్టీలు ఆయా సంబంధిత వర్గాల పై పడ్డాయి. జనసేన అధ్యక్షుడు ఎక్కువగా కాపు వర్గం పై నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబు అయితే కాపు వర్గం వారి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వాళ్లకు కార్పొరేషన్ ఎరతో పాటు కొత్తగా రిజర్వేషన్లలో కాపులకే సగం అని అంటున్నారు. ఇప్పుడు ఇదే లిస్టులోని కి కే ఏ పాల్ కూడా చేరారు. కాపులంతా కలిసి తనకి ఓట్లు గుద్దుతారని అని అంటున్నారు.

KA Paul asking Pawan to join hands with him; Is he desperate or respect

నేను కాపు ని అయినా దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశాను అని, ఎస్ టి, ఎస్ సి లు కాకుండా ఇప్పుడు కాపు వర్గం వారు కూడా ఆయనతో ఉంటారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

కాపులను ఆదుకునే బాధ్యత తనదేనని విదేశాల నుండి ఎన్ని వందల కోట్లు కావాలన్నా తెస్తాను అని ప్రతి కాపు కు స్టయిఫండ్ ఇస్తా అని ఆయన చెప్పారు.

పవన్ కి ఓట్ బ్యాంక్ తక్కువగా ఉందని, తనతో కలిస్తే ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి పోతాను అని ఎవరికి భయపడవద్దు అని అన్నీ తను చూసుకుంటాను జనసేన నేతకు భరోసా ఇస్తున్నారు.

పవన్ ని రమ్మని ఎంత పిలుస్తున్న ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు. తనలో కలిసి పొతే ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఇస్తామని పవన్ కి ఓటు బ్యాంకు 5 శాతమే ఉంది అని కావాలంటే సర్వే చేసుకోమని అంటున్నారు.

ప్రజాశాంతి పార్టీకి 44 వేల మంది కో ఆర్డినేటర్స్ ఉండగా ఒక్కొక్కరు 600 మందిని చేరిస్తే మూడు కోట్లు అవుతారని ఈసారి గ్యారెంటీగా అధికారం తమదేనని చెప్తున్నారు. చంద్రబాబు తమ బలం చూసి వణికిపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

రాబోయే మార్చిలో మహా మార్పులు జరిగి, ఏప్రిల్ లో సునామి ఏర్పడి, ఎన్నికల్లో అన్ని పార్టీలు తుడిచిపెట్టుకుపోయి ప్రజాశాంతి పార్టీ కె అధికారం చే జిక్కుతుంది అని రాజకీయ జోస్యం చెప్తున్నారు.

అసలు ఏ పార్టీ మద్దతు తమకు అవసరం లేదన్న పాల్ మరి జనసేన మద్దతు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నట్టో అర్థం కావడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *