రగులుతున్న ఏపీ రాజకీయాలు

ఏపీలో రాజకీయాలు  మరుగుతున్నాయి. వైసీపీ ని మించిపోయే అధికారంలోకి వచ్చేయాలని టిడిపి, ఈ రెండు పార్టీలను అంతం చేసి అధికారంలోకి రావాలని కొత్తగా పుట్టిన జనసేన లో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికార టిడిపి ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంది. ఇక వైసీపీ ,జనసేన లో టిడిపి వేస్తున్న అడుగులు, తీసుకుంటూనా నిర్ణయాలను తదేకంగా చూస్తూ ఇక్కడ పరిస్థితిని అంచనా వేసుకుని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను సైతం సిద్ధం చేసుకుంటున్నాయి. చంద్రబాబు ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే సంక్షేమ పథకాలను మరింతగా పెంచారు.

ముఖ్యంగా కోటి మందికి పైగా ఉన్న మహిళ ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు ఈ క్రమంలోనే పింఛన్లు, డ్వాక్రా, పసుపు కుంకం వంటి పథకాలను భారీ ఎత్తున అమలు చేస్తున్నారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జోరు పెరిగిందనే చెప్పాలి. అయితే దీనికి విరుగుడుగా వైఎస్సార్సీపీ కూడా కొత్త పథకాలతో ప్రజల్లోకి వచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.

ప్రజలపై వరాల వర్షం కురిపించేందుకు రెడీ అయ్యారు.  అదే సమయంలో జనసేనని పవన్ కూడా ఇప్పటికే ప్రజలకు అనేక వరాలు ప్రకటించాడు కూడా.

చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగా నే చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. ఆయా పార్టీల ప్రణాళికలపై ప్రజలు ఏం అనుకుంటున్నారు? అనేది ఆసక్తిగా మారింది.

ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి పథకాలు ప్రకటించడానికి ప్రజలు వ్యతిరేకం కాదు.

అయితే ఇదేదో ఆయన ఎన్నికల సమయం మభ్యపెట్టి వినియోగించుకుని .ఓట్లు వేయించుకునే రాజకీయం మాదిరిగానే ఉందని ప్రజలు అంటున్నారు.

వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడాన్ని కాదని లేకపోయినా వారికి జీవితాంతం ఉపయోగపడే ఆర్థికంగా బలాన్నిచ్చే ఉపాధి ని చూపించ గలరని  కోరుతున్నారు.

తమను ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ లపై ఆధారపడకుండా స్వశక్తి పై ఆధారపడేలా చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

అదే సమయంలో ప్రభుత్వం తరఫున జరిగే ప్రతి పనిని అవినీతి లేకుండా చేయాలని కోరుతున్నారు.

నిత్యావసర వస్తువుల తో సహా  ప్రజా ఉపకార వస్తువుల ధరలు పెరకుండా. చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరి దీనిని పార్టీల నాయకులు ఆలోచిస్తారా చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *