జైల్లో చిన్నమ్మకు(శశికళ) రాజభోగాలు

ఐదు ప్రత్యేక గదులు వంట చేసేందుకు ఓ మనిషి సినిమాలు సీరియళ్లు చూసేందుకు ఓ టీవీ రుచికరమైన మాంసాహార భోజనం బట్టలు ఉతికేందుకు మరో వ్యక్తి వాకింగ్ చేసేందుకు విశాలమైన స్నేహితులతో మాట్లాడేందుకు గంటలకొద్దీ సమయం. ఇవన్నీ ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్ లోని ప్రత్యేక సదుపాయాలు అనుకుంటే పొరపడినట్లే! కానే కాదు.

జైలు ఖైదీకి తొక్కుతున్న మర్యాదలు ఇవి. ఖైదీ ఎవరో కాదు, ఇవన్నీ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి అన్నాడీ ఎంకే బహిష్కృత నేత శశికళ చిన్నమ్మ కటకటాల్లో లభించిన వీఐపీ ట్రీట్మెంట్ గురించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

RTI reveals about Sasikala:
5 rooms, Personal cook: Special Jail Treatment for Sasikala ‘enjoying’ VIP facilities in jail

జయలలిత నచ్చెలి అయినా శశికళకు అక్రమాస్తుల కేసులో 2017లో న్యాయస్థానం నాలుగేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. 2017 ఫిబ్రవరి 14న జై లులో శశికళ అడుగు పెట్టిన సమయంలో ఆమెకు కేవలం ఒక గది మాత్రమే కేటాయించారు. ఆ తరువాత కొద్ది కాలానికి ఆమెకి వీఐపీ ట్రీట్మెంట్ దక్కింది.

సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త నరసింహమూర్తి దాఖలు చేసిన ఫిర్యాదు తో శశికళ జైలు సీత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలోని వివరాల ప్రకారం శశికళ పక్కనే ఉన్న నాలుగు గదుల్ని ఖాళీ చేసి అందులోని మహిళా ఖైదీలను పక్క సెల్ లోకి పంపేశారు. ఆ తర్వాత మొత్తం ఐదు గదులు శశికళకే కేటాయించారు.

ఖైదీలకు ప్రత్యేకంగా వంట వండే నిబంధనలేమి చట్టంలో లేవు. కానీ శశికళ కోసం అజంతా అనే మహిళ ఖైదీ ని ప్రత్యేకంగా వంట మనిషి గా నియమించారు. అవసరమైనప్పుడు బయట నుంచి మాంసాహార భోజనాన్ని తెప్పించి శశికళ సేవలో అధికారులు పోటీ పడ్డారు. మరోవైపు శశికళను కలిసేందుకు నాయకులు అతిధులు పెద్ద సంఖ్యలో నేరుగా ఆమె గదికి వెళ్లే వారిని జైల్లోని సీసీటీవీ రికార్డుల్లో నమోదైంది.

ఇందుకోసం అయిదు గదుల్లో ఒక గదిని మీటింగ్ రూమ్ గా మార్చారు. నిబంధనల ప్రకారం సందర్శకులతో కేవలం 45 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ చిన్నమ్మ కోసం రూల్స్ ను పక్క పెట్టేశారు. అతిథులతో ఆమె ఏకంగా మూడు నాలుగు గంటల పాటు చర్చలు జరిపేవారిని తెలింది.

కాగా తాజాగా వెలుగులోకి వచ్చిన సంచలన అంశాల నేపథ్యంలో గతంలో శశికళకు జైల్లో విఐపి ట్రీట్మెంట్ పై అప్పటికి జైళ్ల శాఖ డిఐజి డి రూప సంచలన ఆరోపణలు వాస్తవ మని తేలింది. జైలు ఉన్నతాధికారులు రూ.2 కోట్ల వరకు లంచాలు తీసుకుని శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ 2017 జూన్ 12న ఆమె మీడియాకెక్కడం కలకలం రేపింది.

ఆమె నేరుగా జైలు శాఖ డీజీ(ప్రిజన్స్ హెచ్ ఎన్ సత్యనారాయణరావు పైనే ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి సిద్ధరామయ్య ప్రభుత్వం హుటాహుటిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో కమిటీని నియమించింది ఈ కమిటీ 2017 నవంబర్ 17న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

శశికళకు జైల్లో రాజభోగాలను కల్పించిన విషయం వాస్తవమేనని కమిటీ విచారణలో తెలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *