కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది…. సినీ నటి విజయశాంతి ని ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని అనుకుంటుంది….

మరీ ఖమ్మం ఎంపీ స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తారా ? లేదా?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడిందనే విషయం స్పష్టమైంది.

టీఆర్ఎస్ దూకుడును తట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోవడానికి బాగానే కష్టపడాల్సి ఉంటుందన్నది రాజకీయవర్గాల మాట.

అయితే తెలంగాణ వ్యాప్తంగా తన హవా కొనసాగించిన టీఆర్ఎస్… ఖమ్మంలో మాత్రం చతికలబడిన వైనం… ఫలితాలను బట్టి అర్థమైంది.

తమ పార్టీలోని అంతర్గత కలహాల వల్లే ఖమ్మంలో ఓడిపోయామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నా… జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందనే విషయంలో మాత్రం ఓ క్లారిటీ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహారచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందుకోసం సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతిని ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నా… జిల్లా నేతల మధ్య సఖ్యత లేదు.

గతంలో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పలుసార్లు పని చేసిన రేణుకా చౌదరి అంటే జిల్లాలోని కాంగ్రెస్ నేతలు చాలామంది గిట్టదు.

ఈ కారణంగానే జిల్లా నేతలు కాకుండా… రాష్ట్రంలో పాపులారిటీ ఉన్న నేతలను ఖమ్మం ఎంపీగా బరిలోకి దించితే జిల్లాలోని నేతలెవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండబోవని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ఈ కారణంగానే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి విజయశాంతి పేరును సిఫారసు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.

మరి… గతంలో మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విజయశాంతి… ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతారా అన్నది చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *