ఓ కెసిఆర్, మోడీ కళ్లలో ఆనందం కోసమేనా ఇదంతా..!

మోడీ కళ్లలో ఆనందం కోసమేనా ఇదంతా:  ఈ దఫా ప్రెస్ మీట్ లో పూనకం వచ్చినట్టు ఊగిపోయారు కేసీఆర్. చంద్రబాబుకి కడుపునిండా చీవాట్లు పెట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం భారతదేశ చరిత్రలోనే లేదు. సందర్భం లేకుండానే అలాంటి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. ఆరా తీస్తే దీని వెనక ప్రధాని మోడీ హస్తం ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మోడీతో భేటీ తర్వాతే కేసీఆర్ ఇలా తిట్లపురాణం స్టార్ట్ చేశారు.

ఏపీలో బీజేపీని, మోడీని విలన్ లా ప్రొజెక్ట్ చేస్తోంది టీడీపీ. ప్రత్యేకహోదా రాకపోవడానికి కారణం బీజేపీయేనంటూ, ఏపీకి నిధులివ్వకుండా అడ్డుపడుతోందంటూ తిట్టి పోస్తోంది. బాబు బూటకపు మాటలు నమ్మకపోయినా, హోదా విషయంలో మోడీ మోసం చేశాడని జనం బలంగా విశ్వసిస్తున్నారు. ఈ దశలో కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏపీకి హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబేనని అన్నారు.

ఈ టైమ్ లో చంద్రబాబుని గిల్లుకోవడం వల్ల కేసీఆర్ కి ఎలాంటి ఉపయోగమూ లేదు. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ కి స్థానమూ లేదు. అలాంటిది కేసీఆర్ తిట్లు చూస్తుంటే అది మోడీ కళ్లల్లో ఆనందం కోసమే అనే విషయం స్పష్టమవుతోంది.

మోడీ బీటీమ్ లో కేసీఆర్ ఉన్నాడు కాబట్టే చంద్రబాబుపై ఈ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇలాంటి మైండ్ గేమ్ లు ఆడటంలో మోడీ సిద్ధహస్తుడు కాబట్టే కేసీఆర్ తో బాబు పరువు బజారుకీడ్చేలా చేశారని అనుకోవాలి.

ఈ పత్రికా సమావేశానికి ప్రధాన కార్యక్రమంగా 2 విషయాలపై చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంది:

  1. చంద్రబాబు హైకోర్టు డివిజన్పై వ్యాఖ్యానించారు
  2. చంద్రబాబు తన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తన ప్రణాళికలను మరియు ప్రయత్నాలపై విమర్శలు చేశారు

కానీ అతను వెళ్లి అనేక ఇతర పాయింట్లు తాకిన, కేసీఆర్ తన ట్రేడ్ మార్క్ యాసను మరియు గుద్దులుతో మాత్రమే ఈ విధంగా మాట్లాడగలనని నేను చెబుతాను. కొన్ని వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు, ఇది సి.పి.ఎన్.ను ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్నినిర్మించటానికి సహాయపడవచ్చని మరియు వైఎస్ఆర్సిపి అవకాశాలను ప్రభావితం చేస్తుందని తెలియజేయవచ్చు. నేను ఈ నమ్మకం లేదు మరియు వాస్తవానికి ఈ విధంగా చంద్రబాబు తీసుకోవాలని ఎవరైనా కోరుతున్నారు.

“డిసెంబర్ నాటికి వెళ్లిపోతామని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వమే అఫిడవిట్ ఫైల్ చేసింది. మరి ఇప్పటివరకు ఎందుకు కోర్టు హాల్ తయారుచేసుకోలేదు. ఇప్పుడు నువ్వేదో హడావుడి చేస్తున్నావు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. దాన్ని కేంద్రం నోటిఫై మాత్రమే చేసింది. అది దాని బాధ్యత. అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా అంటావ్. చంద్రబాబు అంత డర్టీయస్ట్ పొలిటీషియన్ ఈ దేశంలో ఎవడూ లేడు. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ను భరిస్తున్నందుకు ఆంధ్ర ప్రజలకు చేతులెత్తి మొక్కాలి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *