జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారు

Senior IPS Officer Y C Modi Appointed as Director General of National Investigation Agency

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన అత్యాచారం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారు అని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు.

అందుకే ఎన్ఐఏ విచారణకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. విచారణ జరిగితే హత్యాయత్నానికి దాగి ఉన్న కుటృతెర వెనుక ఉన్న కీలక వ్యక్తుల పేర్లు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.

వాసిరెడ్డి పద్మ బుధవారం హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన సంఘటనతో తమకేమీ సంబంధం లేదని అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని తొలుత చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంటే మళ్ళీ నాలుక మడత వేశారని మండిపడ్డారు.

చంద్రబాబు ఇప్పటికే సిట్ విచారణను నీరుగార్చేలా చేశారని విమర్శించారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సాక్షాధారలను ఏన్ఐఏకు ఇవ్వకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు.

15 రోజులుగా చంద్రబాబు వ్యాపక మంత ఏన్ఐఏ విచారణ పైనే కేంద్రీకృతమై ఉన్నారు. చివరకు కేంద్ర హోంమంత్రికి లేఖ కూడా రాశారు అని గుర్తు చేశారు. ఏన్ఐఏ విచారణ అంటే చంద్రబాబు కి ఎందుకు అంత భయం అని నిలదీశారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను ఎదుర్కోలేక భౌతికంగా అంతం చేయడానికి ప్రయత్నించారు తన వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని విషయం చంద్రబాబు తెలిసి కూడా విచారణకు అడ్డుపడుతున్నారు. ప్రజలకు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారు ఏపీలో 15 రోజులుగా పాలన కుంటుపడింది. సీఎం కోల్ కత్తా వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసి వచ్చారు.

అయితే ఇతర జాతీయ నేతలు అపాయింట్మెంట్లు చంద్రబాబుకు లభించడం లేదు. వివిధ రాజకీయ పార్టీల నేతలను బలవంతంగా కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న పర్యటనలు ప్రజా శ్రేయస్సు కోసం కాదు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *