హోదాను అడ్డుకున్న వారికి తగిన బుద్ధి చెప్పాలి ఇంటికో ఉద్యోగం అని మోసం చేసిన చంద్రబాబు

Chandrababu Changes Colours Like Chameleon

Chandrababu Changes Colours Like Chameleon

హోదాను అడ్డుకునే వారికి తగిన బుద్ధి చెప్పాలని వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. ఎన్ఏడి లోని మహతి కళాశాలలో బుధవారం నిర్వహించిన. “ఎపి నీడ్స్ చేంజ్” సదస్సులో ఆయన విద్యార్థులతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బిజెపి మాట తప్పిందన్నారు. ఆ తరువాత నాలుగున్నర ఏళ్లలో హోదాపై పలుమార్లు మాట మారుస్తూ హోదా కావాలంటూ దొంగ దీక్షలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ విధంగా నమ్మాలి అని ప్రశ్నించారు.

ఓట్ల రాజకీయాల కోసం మాటలు మార్చే వారిని ఎవరు నమ్మద్దు అన్నారు. హోదా వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు ఆయన వివరించారు. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల నేటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి అన్నారు.

టిడిపి ఇంటికో ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మొహం చాటేసింది అన్నారు. ఇలాంటి ప్రభుత్వాలను అదే ఓటుతో మళ్లీ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి తద్వారా విద్యా దానం చేశారన్నారు. ఇలాంటి వారికి కృతజ్ఞతలు చెప్పి రుణం తీసుకునే రోజులు వస్తున్నాయి అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటి ది హోదా వస్తే యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని హోదా ఇవ్వకుండా రాకుండా అడ్డుకున్న పార్టీలను వెంటనే గద్దె దించాలి దీనికి ఒక్కటే సరైన మార్గం. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు.

ప్రత్యేక హోదా వస్తే రాయితీ లభిస్తాయని పరిశ్రమలు వస్తాయి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ప్రత్యేక హోదాను విమర్శించిన పార్టీలను తరిమికొట్టాల.

ఒక కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి యూనియన్ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు కాంతారావు విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ క్రాంతి కిరణ్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *