వైసిపి పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు నాయుడు

రాజకీయ క్రీడలో ఎత్తులు, పైఎత్తులు వేయడంలో చంద్రబాబు అపర చాణక్యుడు అనేవారు. మొన్నటి వరకు బాబు కూడా అలాగే ప్రవర్తించి తన చాణక్య నీతిని బయట పెట్టుకునే వాడు.

కానీ 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బాబు తెలివితేటలు తగ్గిపోయాయ.

అన్ని విషయాలలో బొక్కబోర్లా పడుతున్నాడని ప్రతిపక్షాల కాదు స్వపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.

40 ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నలభై ఏళ్ల వయసున్న జగన్ పన్నిన ఉచ్చులో బాగా ఇరుక్కుపోయిన తెలుగుదేశం నేతలె బాహాటంగా వ్యాఖ్యానించడం విశేషం.

జగన్ సంవత్సరం కిందట ప్రజా సంకల్ప యాత్ర లో ప్రకటించిన నవరత్నాలు మంచి ప్రజాదరణ పొందింది.

ముఖ్యంగా పింఛన్లు రెండు వేలకి పెంచడం. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, ఇలాంటి పథకాలు కి ప్రజల్లో సుముఖత వ్యక్తం అయింది.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిసి ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ నవరత్నాలు ఒకటిగా దొంగిలించడ౦ మొదలెట్టారు.

సామాజిక పింఛన్ల పెంపుతో జగన్ ని దెబ్బ తీద్దామని బాబు భావించారు. నారా చంద్రబాబునాయుడు ఇస్తున్న హామీలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మక మానవు.

నిలిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా దిక్కు లేదు గాని కొత్తగా హామీలు ఇచ్చేందుకు కూడా బాబు చేస్తున్న యత్నాలను దుస్సాహసం.

గడిచిన ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ డ్వాక్రా రుణాల మాఫీ తో పాటు చాలా హామీలను ఇచ్చిన చంద్రబాబు వాటిలో మెజార్టీ హామీల అమలు కి వెళ్ళిపోయారు.

ఇందుకు ప్రధాన కారణంగా నిధులు లేవు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక లోటు తో కొత్త ప్రయాణం ప్రారంభించిన నవ్యాంధ్రకు నిధుల లభ్యత అంత ఈజీ కాలేదు.

మరో మూడు నెలల్లో మరోమారు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలను వూరించేందుకు చంద్రబాబు ఏకంగా ఓ భారీ బహిరంగ సభలో గడిచిన ఎన్నికల్లో తాను ఇచ్చిన రుణాల మాపీని మాటమాత్రంగా కూడా ప్రస్తావించని చంద్రబాబు.

కొత్తగా ప్రతి డ్వాక్రా మహిళలకు పదివేల నగదు తో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్ అందిస్తానని ప్రకటించారు.

దీనికి ఎంత లేదన్నా 15 వేల కోట్ల మేర నిధులు అవసరమని అంచనా.

కొన్ని డ్వాక్రా మహిళలకు ఇస్తామన్నా 10000 కూడా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తారట. అంటే చెక్కులు ఇస్తే కానీ బాబు మాటలు నమ్మే స్థితిలో మహిళ లేరా అని అర్థం కదా.

అసలు ఈ చెక్కుల పై ఎవరు సంతకం పెడతారు. సంక్షేమ పథకాల లబ్ధి ఇలా చెక్కులుగా ఇవ్వొచ్చా?

చంద్రబాబు నాయుడు ప్రకటించే పథకాలు అన్ని ఎన్నికల జిమ్కు గానే ఓటర్లు పరిగణిస్తారు.

ఈసీ అభ్యంతరాలు చెప్పదా? అన్ని ముందుచూపు లేని నిర్ణయాలే. ఈ హామీకి కాస్తంత ముందుగా అప్పటిదాకా ఉన్న పెన్షన్లు ఎన్నింటికి రెట్టింపు సొమ్ము ఇస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు. అందుకోసం కూడా అదనంగా మరో 5 వేల కోట్లు అవసరమని పరోక్షంగా చెప్పేశారు.

వీటికి తోడు ఉద్యోగులకు తాయిలాలు ఇస్తున్న చంద్రబాబు అందుకోసం కూడా ఐదు వేల కోట్లను జమ చేయాలిసిన పరిస్థితి కల్పించారు.

రైతుల రుణమాఫీ కోసమే అప్పులు చేస్తున్న చంద్రబాబు, ఇప్పుడు కొత్తగా ఇస్తున్న హామీలను ఎలా అమలు చేస్తారని అనుమానాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

పాత హామీల అమలుకు అప్పులు చేస్తున్న చంద్రబాబు కొత్త హామీల కోసం ఇంకా ఎంత మేర అప్పులు చేయాలన్నది ఇప్పుడు అందరిని మెదళ్లను తొలుస్తూనే ప్రశ్న గా నిలుస్తోంది.

గడిచిన నాలుగేళ్లుగా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టని చంద్రబాబు నాయుడు కొత్త పథకాలు ఎన్ని కలలు గానే మిగిలి పోతాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *