బిసిలకు చంద్రబాబు మొదటి దెబ్బ… నమ్మి వచ్చిన బుట్టా రేణుకకు బాబు మొండి చేయి!

Andhra Pradesh Vidhan Sabha constituency map

  • జయహో బిసి అంటూ బిసి మహిళకు తీరని నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు.
  • కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాకతో బుట్టాకు కర్నూల్ లోకసభ సీటు ఆశలు గల్లంతు, భవిష్యత్ అంధకారం.
  • బుట్టా రేణుక ఆశించిన ఎమ్మిగనూరు సీటును ఇప్పటికే జయనాగేస్వర రెడ్డికి ప్రకటించిన నారాలోకేష్.
  • పాణ్యం, ఆలూరు లేదా డోన్ స్థానాల్లో ఒకటి కోట్లా సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్.
  • అంతఃర్మధనంలో బుట్టా రేణుక.
  • నమ్మివస్తే నట్టేట ముంచారంటున్న బుట్టా రేణుక వర్గీయులు.
  • మనసంతా వైసిపి వైపు ఉన్నా, టిడిపి వైపు అడుగులు వేసిన కోట్ల!
  • వైసిపిలో ఎంట్రికి ప్రయత్నించిన కోట్ల!
  • కర్నూల్ లోక్ సభ స్థానం కోసం మొండి పట్టు పట్టిన కోట్ల.
  • కర్నూల్ లోక్ సభ స్థానం బిసిలకు మాట ఇచ్చామని, మరొకచోట చూద్దాం అని వైఎస్ జగన్ అన్నా కోట్ల తొందరపడ్డారంటున్న వైసిపి శ్రేణులు.

Babu fired Butta Renuka, first slap to BC’s

కర్నూల్ జిల్లా రాజకీయం రంగులు మారుతోంది. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు ఆ పార్టీ నేతల తలరాతలు తలకిందులు అవుతున్నాయి.

గెలిపించిన పార్టీని వదిలి, చంద్రబాబును నమ్మి వచ్చి టిడిపిలో చేరిన నేతలకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించడం, విందు రాజకీయాలకు తెర తీయడంతో కర్నూల్ జిల్లాలోని కొందరు తెదేపా నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి..

కోట్ల చేరికతో ఎవరి సీటు గల్లంతు అవుతుందో అని బిక్కు బిక్కుమంటూ అధినేత చంద్రబాబు వైపు చూస్తున్నారట అక్కడి పచ్చపార్టీ నేతలు.

తాజాగా కోట్ల టిడిపి వైపు అడుగులు వేయడంతో చంద్రబాబు బిసిలపై తోలి దెబ్బ వేసినట్టు అయింది.

నమ్మి, అవకాశమిచ్చి ఎంపీని చేసిన జగన్ పార్టీని కాదని , చంద్రబాబును నమ్మి, టిడిపిలో చేరిన కర్నూల్ ఎంపి బుట్టా రేణుకకు చంద్రబాబు గట్టిగానే దొబ్బకొట్టినట్టు అయింది.

బిసిలకే నా మొదటి ప్రాధాన్యత అని ఊదరగొట్టే చంద్రబాబు అదే బిసీలకు మొదటి దెబ్బ గట్టిగానే వేశాడని బుట్టా అభిమానులు భావిస్తున్నారు.

ఒక వైపు జయహో బిసి అంటూ, మరొక వైపు ఒక బిసి మహిళకు చంద్రబాబు తీరని నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోట్ల ఎంట్రీతో బుట్టా రేణుక ఆశించిన కర్నూల్ లోకసభ సీటు ఆశలు గల్లంతు కావడమే కాకుండా ఆమె భవిష్యత్ ను కూడా చంద్రబాబు అంధకారంలో నేట్టేసినట్టు అయింది.

దీంతో నమ్మివస్తే నట్టేట ముంచుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుట్టా వర్గీయులు.

ఇదేనా బిసిలకు చంద్రబాబు చేసే మేలు అంటూ లోలోన కుములి పోతున్నారట.

ఐతే ఇదంతా చంద్రబాబు రాజకీయానికి ఒక వైపు ఐతే మరో వైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తప్పని పరిస్థితుల్లో టిడిపి వైపు అడుగులు వేసినా మనసంతా వైసిపి వైపే ఉందని టాక్ వినిపిస్తోంది.

మొదట కోట్ల వర్గీలు, అనుచరులు వైసిపిలో చేరాయాలని కోట్లకు సూచించడంతో వైసిపిలో ఎంట్రికి కోట్లా ప్రయత్నించినా అక్కడా చుక్కెదురు కావడంతో, దిక్కుతోచని స్థితిలో, తప్పనిసరి పరిస్థితుల్లో భార్యా, కొడుకు ఒత్తిడికి తలొగ్గి సైకిల్ ఎక్కెందుకు కోట్ల సిద్ధపడ్డట్టు సమాచారం.

అయితే వైసిపితో జరిపిన సంప్రదింపుల్లో కోట్ల తనకు కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు మరో మూడు సెంబ్లీ స్థానాలు కావాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

కానీ కోట్ల ఆశించిన కర్నూల్ లోక్ సభ స్థానం ఇప్పటికే బిసిలకు ఇచ్చేందుకు మాట ఇచ్చామని, మరొకచోట మీకు సముచిత స్థానం కల్పిస్తామని వైసిపి చీఫ్ వైఎస్ జగన్ కోట్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు కోట్ల పట్టువిడవక పోవడంతో వైసిపి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.

ఏది ఏమైనా బిసి లకు కర్నూల్ పార్లమెంట్ స్థానం కేటాయిస్తానని ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్ నిలబడి, కోట్ల కుటుంబం లాంటి రాజకీయ నేపధ్యం ఉన్న వారిని సైతం వదులుకునేందుకు సిద్ధపడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాంటిది కోట్ల తను ఆశించిన టికెట్టు కోసం, అనుచరుల అభిప్రాయానికి విరుద్ధంగా టిడిపిలో చేరాలన్న నిర్ణయం తీసుకొని తొందర పడ్డారన్న వాదన పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది.

అయితే సగటు ఓటరు మాత్రం ఈ యాలా రేపు రాజకీయాల్లో స్వార్థం తప్ప ఇలువలు యాడ ఉన్నాయి అంటూ.. నిట్టూరుస్తున్నాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *