ఎన్నికల కార్యాచరణ లో సీఎం చంద్రబాబు నాయుడు

Kamma brothers suspects other caste voters
రాబోవు అసెంబ్లీ ఎన్నికలపై చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లక పోవడం పై నిరసన వ్యక్తపరుస్తూ ఎమ్మెల్యే ల పై ఫైర్ అయ్యారు.
చేసిన కార్యక్రమాలను చెప్పు కోవాల్సిన బాధ్యత MLA లదే అని స్పష్టం చేశారు. ఇక ఫిబ్రవరి చివరికి అభ్యర్థులను ఖరారు చేసి, ఎన్నికల ప్రచారంలో ఉంటానని చెప్పారు పార్టీ.
ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు.
ఇటీవల తీసుకువచ్చిన ‘కియో’ గురించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
రాజశేఖర్ రెడ్డి ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేదని… ప్రధానికి ‘కియో’ తెచ్చారని బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఎత్తుగడల్లో జగన్ నిష్ణాతుడని వ్యాఖ్యానించారు.

రేపు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పిన సీఎం ఫిబ్రవరి 11న ఢిల్లీ లో జరిగే దీక్షకు అందరూ రావాలని ఆదేశించారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజాసంఘాలు పోరాడుతున్నాయి అని వారితో మమేకం కావాలి అని చెప్పారు.
ఫిబ్రవరి 1న బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆ బంద్ కు వ్యతిరేకం కాదని చెప్పారు.
అందరూ నల్ల చొక్కాలు ధరించి కేంద్రం చేసిన ద్రోహానికి నిరసన తెలపాలని సూచించారు.
ఫిబ్రవరి 2,3,4 తారీకుల్లో పింఛన్ల పండుగ నిపేదల పండగగా జరపాలని ఆదేశించారు.
ఫిబ్రవరి 9న నాలుగు లక్షల సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సమావేశాలలోనే కాపు రిజర్వేషన్లు మరియు B C sub planకు చట్టబద్ధత బిల్లులను ఆమోదిస్తామని అన్నారు.
రాబోవు ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు అని ఎమ్మెల్యేలకు వివిధ సూచనలు చేశారు.
ఫిబ్రవరి నాటికి ఎంపిక ప్రక్రియ ముగించి తర్వాత 30 రోజులు ప్రచారం చేస్తానని అభ్యర్థులు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఎమ్మెల్యే అన్ని కులాల సంఘాలతో మమేకం కావాలి అని ప్రతి కులానికి న్యాయం చేశామని విశ్లేషించారు.
రోజుకు రెండు జిల్లాల్లో పర్యటించాలా… లేదా సభలను నిర్వహించాలా… రోడ్ షో చేయాలా… బస్సు యాత్ర సాగించాలా అనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.