రాజకీయాలపై తేల్చి చెప్పేసిన అజిత్

సినీ తారలు రాజకీయాలలోనికి రావడం కొత్త విషయమేమీ కాదు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినీ పరిశ్రమ నే కాకుండా తమిళనాడు కూడా ఏలారు.

జయలలిత మరణానంతరం పళని స్వామి కొన్ని అనూహ్య పరిస్థితులలో తమిళనాట ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే వచ్చే ఎన్నికలలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ పోటీపడనున్న నేపథ్యంలో వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

వీరి తరువాత తమిళనాట పెద్ద నటులు అయిన విజయ్ మరియు అజిత్ లు కూడా రాజకీయ ప్రవేశం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ దిశలో విజయ్ తన సినిమాలలో సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు, కానీ అజిత్ విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.

అయితే ఆ ప్రచారాలు అన్నింటికీ తెరదించుతూ అజిత్ ఒక ప్రకటన ఇచ్చారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరం అని తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఎవరైనా తనకి ఏ పార్టీతో అయినా సంబంధం ఉంది అని అంటే నమ్మవద్దు అని స్పష్టం చేశారు.

తన అభిమానులకి ఇప్పటివరకు ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని కానీ ఓటు వేయమని కానీ చెప్పలేదని ఇకపై కూడా చెప్పబోనని స్పష్టం చేశారు. తనకి రాజకీయాలతో కేవలం ఓటు వేయడం వరకే సంబంధం అని అజిత్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *